వారికి మాస్కులు, భౌతికదూరం అవసరంలేదు : సిడిసి

యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తిచేసుకున్న ప్రజలు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని..

Us India Population Cdc Mask Guidelines Vaccinated

us cdc mask guidelines : యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తిచేసుకున్న ప్రజలు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని.. అలాగే సామాజిక దూరం యొక్క నియమాలను పాటించాల్సిన అవసరం కూడా లేదని పేర్కొంది. అంతేకాదు యుఎస్ లో వివిధ ప్రాంతాలకు వెళితే కరోనా పరీక్ష చేయవలసిన అవసరం కూడా లేదని స్పష్టం చేసింది.

మీరు కరోనా సోకిన వారితో సంబంధం కలిగి ఉన్నా.. ఎటువంటి లక్షణాలు లేనట్లయితే, అప్పుడు పరీక్ష చేయవలసిన అవసరం లేదని తెలిపింది. సిడిసి నిర్ణయం కారణంగా అమెరికాలో మెజారిటీ ప్రజలు మాస్కులు ధరించడం లేదు.. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కూడా మాస్కు లేకుండా మీడియా ముందు కనిపించారు. ఈ పరిణామం అమెరికా వేగంగా చేసిన టీకాల ఫలితమని అన్నారు.