Titan Submersible destroyed: టైటానిక్ సబ్‌మెర్సిబుల్ పేలుడును రికార్డ్ చేసిన యూఎస్ నేవీ

అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ సబ్‌మెర్సిబుల్ నౌక పేలుడును యునైటెడ్ స్టేట్స్ నేవీ రికార్డు చేసింది. టైటానిక్ శిధిలాల పర్యటనకు అట్లాంటిక్ మహాసముద్రంలోకి వెళ్లిన కొద్దిసేపటికే మినీ జలాంతర్గామి అదృశ్యమైందని, సముద్ర గర్భంలో సౌండ్ మానిటరింగ్ పరికరాలపై టైటాన్ సబ్‌మెర్సిబుల్ పేలినట్లు తాము గుర్తించామని యూఎస్ నేవీ తాజాగా వెల్లడించింది....

Titanic submersible destroyed

Titan submersible destroyed: అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ సబ్‌మెర్సిబుల్ నౌక పేలుడును యునైటెడ్ స్టేట్స్ నేవీ రికార్డు చేసింది. (US Navy recorded) టైటానిక్ శిధిలాల పర్యటనకు అట్లాంటిక్ మహాసముద్రంలోకి వెళ్లిన కొద్దిసేపటికే మినీ జలాంతర్గామి అదృశ్యమైంది. సముద్ర గర్భంలో సౌండ్ మానిటరింగ్ పరికరాలపై టైటాన్ సబ్‌మెర్సిబుల్ పేలినట్లు తాము గుర్తించామని (Titan submersible imploded, was destroyed) యూఎస్ నేవీ తాజాగా వెల్లడించింది.

Titanic submarine:టైటాన్ సబ్ మెర్సిబుల్ కథ విషాదాంతం..ఐదుగురు మరణించి ఉండవచ్చని ఓషన్‌గేట్ ప్రకటన

తాము సబ్‌మెర్సిబుల్ యొక్క మినీ జలాంతర్గామి శిధిలాలను కనుగొన్నట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ తెలిపింది. రహస్య శబ్ద పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా ఆదివారం టైటాన్ అదృశ్యమైన కొద్దిసేపటికే పేలుడు సంభవించిందని యూఎస్ నేవీ అధికారి ఒకరు చెప్పారు.

Titanic submarine:టైటాన్ సబ్ మెర్సిబుల్ కథ విషాదాంతం..ఐదుగురు మరణించి ఉండవచ్చని ఓషన్‌గేట్ ప్రకటన

యూఎస్ నావికాదళం శబ్ద డేటాను విశ్లేషించగా కమ్యూనికేషన్‌లు కోల్పోయినప్పుడు టైటాన్ సబ్‌మెర్సిబుల్ పేలుడుకు అనుగుణంగా ఉండే అసాధారణతను గుర్తించిందని నేవీ అధికారి వివరించారు. సముద్రగర్భంలో 12,400 అడుగుల లోతులో ఉన్న టైటానిక్ అవశేషాల సమీపంలో సబ్‌మెర్సిబుల్ శిధిలాలను కనుగొన్నట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ పేర్కొంది. యూఎస్ కోస్ట్ గార్డు అందించిన సమాచారంతోనే సబ్‌మెర్సిబుల్‌ లోని ఐదుగురు మరణించినట్లు ఓషన్ గేట్ సంస్థ ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు