Joe Biden
Israel Hamas War: : హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ హతమయ్యాడు. ఈనెల 7న జరిపిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) దాడుల్లో సిన్వార్ మృతి చెందాడని ఇజ్రాయెల్ ధృవీకరించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కాంట్జ్ ధ్రువీకరించారు. ఇది ఇజ్రాయెల్ కు సైనికంగా, నైతికంగా ఘన విజయం. ఇరాన్ నేతృత్వంలో రాడికల్ ఇస్లాం దుష్టశక్తులకు వ్యతిరేకంగా స్వేచ్చా ప్రపంచం సాధించిన విజయమిది. సిన్వర్ మృతితో తక్షణ కాల్పులు విరమణకు, బందీల విడుదలకు మార్గం సుగమం కానుందని కాంట్జ్ పేర్కొన్నారు. డీఎన్ఏ పరీక్ష ద్వారా యాహ్యా సిన్వార్ మృతిచెందినట్టు ధృవీకరించారు.
ఇజ్రాయెల్ ఆర్మీ చెప్పిన ప్రకారం.. దక్షిణ గాజా స్ట్రీప్ లోని రఫా నగరంలో గ్రౌండ్ ఆపరేషన్ సందర్భంగా ముగ్గురు హమాస్ మిలిటెంట్లను హతమార్చడం జరిగింది. వారి మృతదేహాలను తీసుకెళ్లగా.. వారిలో ఒకరు సిన్వార్ ను పోలిన ఆనవాళ్లను గుర్తించారు. సదరు మృతదేహానికి డీఎన్ఏ పరీక్ష నిర్వహించారు. ఇజ్రాయెల్ జైలులో ఉన్న సమయంలో సిన్వార్ యొక్క డీఎన్ఏ నమూనాలు ఇజ్రాయెల్ వద్ద ఉన్నాయి. మరోవైపు.. హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మరణం ధ్రువీకరణ తరువాత ఐడీఎఫ్ ప్రతినిధి డేనియల్ హగారి మాట్లాడారు. మేము ముందే చెప్పాము.. మా యుద్ధం హమాస్ తో.. గాజా ప్రజలతో కాదు అన్నారు.
Also Read: Yahya Sinwar : హమాస్‌కు చావుదెబ్బ.. అధినేత యహ్యా సిన్వార్ హతం.. ఇజ్రాయెల్ వెల్లడి!
యాహ్యా సిన్వార్ మరణంతో ఇజ్రాయెల్ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. మరోవైపు సిన్వార్ మరణం వార్తలపై అమెరికా స్పందించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. సిన్వర్ ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టడం ఆ దేశం, తమ దేశంతో పాటు యావత్ ప్రపంచానికి శుభదినమని అభివర్ణించారు. ఈ ఘటన హాస్ చెరలో ఉన్న బందీల విడుదలకు, ఏడాదిగా సాగుతున్న గాజా యుద్ధ పరిసమాప్తికి బాటలు వేసే అవకాశం ఉందని అభిప్రాయ పడ్డారు.
అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి కమలాహారిస్ స్పందిస్తూ.. ఒసామా బిన్ లాడెన్ ను అంతమొందించిన ఘటనతో తాజా ఘటనను పోల్చారు. సిన్వర్ మరణంతో గాజా యుద్ధం ముగింపునకు మార్గం సుగమం అయిందని పేర్కొన్నారు. యూఎస్, ఇజ్రాయెల్, ప్రపంచం ఈ ఫలితం మెరుగ్గా ఉందని భావిస్తున్నాయి. అతడి చేతులు అమెరికన్ల రక్తంతో తడిశాయి. ఈ వార్తతో బాధిత కుటుంబాలకు సాంత్వన చేకూరి ఉంటుందని ఆశిస్తున్నానని కమలాహారిస్ అన్నారు.
Hamas leader Yahya Sinwar is dead.
This is a good day for Israel, for the United States, and for the world.
Here’s my full statement. pic.twitter.com/cSe1czhd9s
— President Biden (@POTUS) October 17, 2024