Donald Trump: ఎలాన్ మస్క్‌కు బిగ్ షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్.. ఆయనతో అవేమీ చర్చించం..

ఓవల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. ఆ విషయంలో ఎలాన్ మస్క్ జోక్యం ఉండదని స్పష్టం చేశారు.

Donald Trump and Elon Musk

Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటినుంచి డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. టారిఫ్ లు విధిస్తూ ప్రపంచ దేశాలతో కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ముఖ్యంగా చైనా దిగుమతులపై భారీగా సుంకాలు విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా ఉత్పత్తులపై తాముకూడా సుంకాలు విధిస్తామని చైనా తెలిపింది.

Also Read: Dark Oxygen : సైంటిస్టుల కొత్త ఆవిష్కరణ.. సముద్రపు లోతుల్లో పుట్టుకొస్తున్న ఆక్సిజన్.. ‘డార్క్ ఆక్సిజన్’ ఏంటి.. ఎవరికి లాభమంటే?

అమెరికా మొదలు పెట్టిన వాణిజ్య యుద్ధంలో చివరి వరకు పోరాడటానికి తాము సిద్ధమేనని చైనా స్పష్టం చేసింది. అయితే, ‘‘చైనాతో యుద్ధం వస్తే ఎలా వ్యవహరించాలో తెలిపే మిలిటరీ ప్లాన్ ను ఎలాన్ మస్క్ కు అధికారులు తెలియజేయనున్నట్లు’’ న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. ఈ కథనంపై ట్రంప్ స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Also Read: Donald Trump: డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. కీలక ఉత్తర్వులపై సంతకం

న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ‘‘యుద్ధం లాంటి పరిస్థితి ఎదురైతే చైనాతో ఎలా పోరాడాలన్న దానిపై అమెరికా మిలిటరీ 20 నుంచి 30 స్లైడ్స్‌ రూపొందించింది. ఒకవేళ అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు చైనా ఏయే వాటిని లక్ష్యంగా చేసుకుంటుంది..? ఎలాంటి దాడులు చేస్తుంది..? అనే వివరాలు అందులో ఉన్నాయి. యుద్ధంలో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలన్న ప్రణాళికలను కూడా రూపొందించారు. ఈ ప్లాన్‌ను త్వరలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు పెంటగాన్‌ అందించనుంది. అయితే, ఈలోగానే ఆ వివరాలను డిపార్ట్ మెంట్ ఆప్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (డోజ్) సారథిగా ఉన్న ఎలాన్ మస్క్‌ను తెలియజేస్తారు’’ అంటూ కథనంలో పేర్కొంది.

 

ఓవల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. చైనా విషయంలో ఎలాన్ మస్క్ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. మస్క్ కు ఉన్న వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా ఆయనతో అమెరికా యుద్ధ ప్రణాళికలను పంచుకోకూడదని అన్నారు. మస్క్ కు చైనాలోనూ వ్యాపారాలున్నాయి. కాబట్టి ఆయన ప్రభావితం కావొచ్చు. చైనాతో యుద్ధం వస్తే అమెరికా ఎలా ఎదుర్కోవాలో తెలిపే ప్రణాళికలను మస్క్ కు అధికారులు వివరించలేదని, అలా జరగదని ట్రంప్ పేర్కొన్నారు.