Biden Political History : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 77 ఏళ్ల జో బైడెన్ సంచలనం విజయం సాధించాడు. 284 సీట్లలో బైడెన్ గెలుపొందారు. 46 వ అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. మ్యాజిక్ ఫిగర్ 270 దాటేశారు. డొనాల్డ్ ట్రంప్ 214 సీట్లకే పరిమితమయ్యారు. ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ గెలుపొందారు. దక్షిణాసియా నుంచి అమెరికా తొలి ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ రికార్డు సాధించారు.
అత్యధిక ఓట్ల మెజారిటీతో 46వ అధ్యక్షుడిగా బైడెన్ సంచలన విజయం సాధించాడు. ఇప్పటివరకు ఏ అధ్యక్షుడికి కూడా అన్ని ఓట్లు రానంతగా బైడెన్ పట్టం కట్టారు. రిపబ్లిక్ అభ్యర్థి ట్రంప్ పై బైడెన్ భారీ విజయాన్ని సాధించారు. పెన్సిల్వేనియాలో 20 ఎలక్టోరల్ ఓట్లు సాధించి 270 మార్క్ దాటారు.
1970లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1972లో 29 ఏళ్ల వయసులో తొలిసారిగా యూఎస్ డెలావర్ సెనేటర్ గా బైడెన్ ఎన్నికయ్యారు. దేశ చరిత్రలో సెనేటర్ గా అతిచిన్న వయస్కుడిగా ఖ్యాతి చెందారు. 1987 నుంచి 1995 వరకు సెనేట్ జ్యూడిషియరీ కమిటీ అధ్యక్షుడి ఉన్నారు. 1991లో గల్ఫ్ యుద్ధాన్ని వ్యతిరేకించారు.
2009 నుంచి 2017 వరకు బరాక్ ఒబామా పాలనలో 47వ వైస్ ప్రెసిడెంట్ గా సేవలందించారు. 2009లో మౌలిక వసతుల పర్వవేక్షణ, 2010లో ట్యాక్స్ రిలీఫ్ యాక్ట్ తేవడానికి కృషి చేశారు. 2017లో బైడెన్ ను ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ప్రీఢంతో ఒబామా సన్మానించారు. 2019 ఏప్రిల్ లో అధ్యక్షుడిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. జూన్ 2020లో అధ్యక్ష పదవికి నామినేషన్ వేశారు.
ఆగస్టు 11న వైస్ ప్రెసిడెన్షియల్ నామినీ కమలా హారిస్ ఎంపికయ్యారు. ఆల్వేస్ దేర్ ఈజ్ ఏ హోప్ నినాదంతో ఎన్నికల ప్రచారం చేశారు. మంచివాడు, మృదుస్వభావి అని బైడెన్ కు పేరు ఉంది. జోబైడెన్ మొట్టమొదటిసారి డెమొక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. సంచలన విజయం సాధించారు.