Green Cards : ఆరునెలల్లో గ్రీన్‌కార్డుల అప్లికేషన్లు క్లియర్ చేయండి

అమెరికాలో పర్మినెంట్ రెసిడెన్సీ  కోసం లేదా గ్రీన్ కార్డు కోసం వచ్చిన దరఖాస్తులను ఆరు నెలల్లోగా ప్రాసెస్   చేయాలనే సిఫార్సును అమెరికా అధ్యక్ష మండలి ఏకగ్రీవంగా  తీర్మానించింది.

Green Cards :  అమెరికాలో పర్మినెంట్ రెసిడెన్సీ  కోసం లేదా గ్రీన్ కార్డు కోసం వచ్చిన దరఖాస్తులను ఆరు నెలల్లోగా ప్రాసెస్   చేయాలనే సిఫార్సును అమెరికా అధ్యక్ష మండలి ఏకగ్రీవంగా  తీర్మానించింది. ఈ నేపధ్యంలో అధ్యక్షుడు బైడెన్ కు తమ ప్రతిపాదనలు పంపించింది.  బైడెన్ ఆ ప్రతిపాదనలకు అంగీకారం తెలిపితే వేలాది మంది భారతీయులకు గ్రీన్ కార్డు లభించే అవకాశాలు ఉన్నాయి.

ఏషియన్ అమెరికన్లు, స్ధానిక హవాయి ప్రజలు, పసిఫిక్ దీవులకు   చెందిన వారితో ఏర్పడిన అడ్వైజరీ కమీషన్ చేసిన ప్రతిపాదనలను ఆమోదం కోసం వైట్ హౌస్ కు పంపనున్నారు. ఒకవేళ ప్రభుత్వం వాటికి ఆమోదం తెలిపితే ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వారికి గ్రీన్ కార్డు వచ్చే అవకాశం ఉంటుంది.  భారతీయ అమెరికన్ నేత అజయ్ జైన్ భుటోరియా నేతృత్వంలోని బృందం ఈ ప్రతిపాదన చేసింది. ఆ ప్రతిపాదనకు 25 మంది కమీషనర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు.

2021లో కేవలం 65,452 మందికి మాత్రమే గ్రీన్ కార్డు జారీ చేశారు. గ్రీన్ కార్డు ఇంటర్వ్యూలను వేగవంతం చేయటానికి అవసంరం అయితే అదనపు సిబ్బందిని నియమించుకుని మూడు నెలల్లో 100 శాతం ఇంటర్వ్యూలు పూర్తిచేయాలని తెలిపింది. ప్రస్తుతం ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఉన్న సామర్ధ్యాన్ని వచ్చే ఏడాది మే నాటికి 150 శాతానికి పెంచాలని సూచించింది. అమెరికాలో వర్క్ పర్మిట్లు ఇతర అంశాల విషయంలో కూడా యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కు కూడా అడ్వైజరీ కమీషన్ పలు సూచనలు చేసింది. వర్క్ పర్మిట్లు, ట్రావెల్ డాక్యుమెంట్లు తాత్కాలిక పొడిగింపులు ఇతర మార్పులను మూడు నెలల్లో పూర్తి చేయాలని సిఫార్సు చేసింది.

Also Read : YCP Rajyasabha Candidates: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం జగన్

ట్రెండింగ్ వార్తలు