China Balloon US Pilot Selfie : చైనా నిఘా బెలూన్‌తో అమెరికా ఎయిర్ ఫోర్స్ పైలట్ ‘సెల్ఫీ’..!.. ఫోటో విడుదల..

చైనా నిఘా బెలూన్‌తో అమెరికా ఎయిర్ ఫోర్స్ పైలట్ ‘సెల్ఫీ’ ఫోటో విడుదల చేసిన రక్షణశాఖ.

China Balloon US Pilot Selfie : అమెరికాలో చైనా బెలూన్‌ ఎంతగా కలకలం రేపిందో తెలిసిందే. అమెరికా గగనతలంపై చైనా బెలూన్ ఎగటంచూసి అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. దాన్ని కూల్చివేసింది. కానీ అది నిఘా బెలూన్ కాదని వాతావరణ సంబంధిత వివరాలను సేకరించేందుకే అని చైనా చెబుతోంది. కానీ దాన్ని అమెరికా మిస్సైళ్లతో కూల్చివేసింది. ఈ బెలూన్ అమెరికాలో తీవ్ర దుమారం రేపింది. ఒక్క అమెరికానేకాదు యావత్ ప్రపంచం ఉలిక్కి పడింది. ఆయా దేశాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాయి.

ఈ కథ ముగిసిపోయింది అనుకుంటున్న సమయంలో తాజాగా చైనా నిఘా బెలూన్లకు సంబంధించి అమెరికా ఓ ఫోటోను విడుదల చేసింది. అదేమంటే అమెరికా రక్షణశాఖకు చెందిన ఓ పైలెట్ ఆ చైనా బెలూన్ తో సెల్ఫీ దిగాడు. ఆ ఫోటోను అమెరికా విడుదల చేసింది. బుధవారం (స్థానిక కాలమానం ప్రకారం) ఓ ఫొటోను విడుదల చేసింది. చైనా నిఘా బెలూన్ పై నుంచి అమెరికా రక్షణశాఖ విమానం వెళ్తుండగా ఆ విమానం పైలట్ తీసిన ఫొటోను విడుదల చేసింది. U-2 నిఘా విమానం కాక్ పిట్ నుంచి పైలెట్ ఈ ‘సెల్ఫీ’ తీశారు. అమెరికాలోని మోంటానాలో దాదాపు 60 వేల అడుగుల ఎత్తులో ఈ ఫొటో తీసినట్లు సీఎన్ఎన్ సంస్థ వెల్లడించింది. ‘‘అలస్కాలో అమెరికా గగనతలంలోకి నిఘా బెలూన్ ప్రవేశించిన వారం రోజుల తర్వాత ఈ సెల్ఫీ తీశాం అనీ… బెలూన్ ను ట్రాక్ చేయటానికి U-2 నిఘా విమానం పంపాం. అప్పుడే పైలట్ విమానంలో నుంచి ఫొటో తీశారని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.

Chinese spy balloon: చైనా స్పై బెలూన్ ను కూల్చేసిన‌ అమెరికా

కాగా..అమెరికా గగనతలంలో ఈ బెలూన్ ను చూశాకు అగ్రరాజ్యం సైతం ఉలిక్కిపడింది. అది చైనాది అని తెలుసుకున్నాక వెంటనే అప్రమత్తమైంది. కానీ అత్యంత భారీ ఆకారంలో ఉన్న దాన్ని అందులో ఏమున్నాయో తెలియకపోవడంతో పౌరుల భద్రత గురించి ఆలోచించింది రక్షణశాఖ. దీంతో ఆ బెలూన్ పై ఆచితూచి వ్యవహరించింది. పేల్చివేయాలా? వద్దా? అనే మీమాంసలో పడింది. కానీ ఎట్టకేలకు తగిన ఏర్పాట్లతో మిస్సైళ్లతో కూల్చివేసింది. అదే విషయాన్ని అమెరికా ప్రటించింది. ఫిబ్రవరి 4న అట్లాంటిక్ సముద్రంపై చైనా బెలూన్ ను కూల్చివేశామని ప్రకటించింది. ఆ బెలూన్ ను కూల్చివేయటంపై చైనా కస్సుమంది. అది నిఘా బెలూన్ కాదని వాతావరణానికిసంబంధించి వివరాలు సేకరించే బెలూన్ అని చెప్పుకొచ్చింది.

China balloon: చైనా స్పై బెలూన్ నిఘాలో ఇండియా.. మరిన్ని దేశాలు కూడా! అమెరికా నివేదిక ఏం చెప్పిందంటే..

 

ట్రెండింగ్ వార్తలు