Us Troops Disabled 73 Aircraft, Weapons
US troops disabled 73 aircraft, weapons systems : అమెరికా ఎట్టకేలకు 20ఏళ్ల తర్వాత అప్ఘానిస్తాన్ వీడింది. ఆగస్టు 31 డెడ్‌లైన్‌కు ముందు రోజు సోమవారం రాత్రే అఫ్ఘాన్ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయింది. అమెరికా చివరి సైనికుడు కూడా ఆగస్టు 30 రాత్రే కాబూల్‌ను వీడాడు. దాంతో అమెరికా సుదీర్ఘ యుద్ధానికి తెరపడింది. అయితే అమెరికా అప్ఘాన్ దేశం విడిచి వెళ్లటడానికి ముందు వదిలేసిన అనేక ఎయిర్‌క్రాఫ్ట్, సాయుధ వాహనాలు, ఆయుధాలను అమెరికా సైనికులు పని చేయకుండా నిలిపివేశారు. అమెరికా సైనికులు అఫ్ఘాన్ వీడగానే తాలిబన్లు కాబూల్ ఎయిర్ పోర్ట్ హ్యాంగర్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు. విమానశ్రయంలోకి ప్రవేశించిన తాలిబన్లు చినూక్ హెలికాప్టర్లు, సాయుధ వాహనాలను పరిశీలించారు. దీనికి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హైటెక్ రాకెట్ డిఫెన్స్ సిస్టమ్, సాయుధ వాహనాలను అమెరికా సైన్యం పని చేయకుండా చేసినట్లు AFP వెల్లడించింది. సెంట్రల్ కమాండ్ హెడ్ జనరల్ Kenneth McKenzie ప్రకారం.. 73 ఎయిర్‌క్రాఫ్ట్‌లను, 27 హమ్‌వీలను డిమిలిటరైజ్ చేశారు. తాలిబన్లు ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లను వినియోగించుకోలేరు.. అవి ఎప్పటికీ ఎగరలేవని మెకంజీ చెప్పారు.
#Taliban fighters enter a hangar in #Kabul Airport and examine #chinook helicopters after #US leaves #Afghanistan. pic.twitter.com/flJx0cLf0p
— Nabih (@nabihbulos) August 30, 2021
అమెరికా సైన్యం కాబూల్‌ను వీడేందుకు రెండు వారాల ముందే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాకెట్, ఆర్టిలరీ, మోర్టార్ వ్యవస్థను పనిచేయకుండా చేసింది. 70 MRAP సాయుధ వాహనాలను కూడా అమెరికా కాబూల్ ఎయిర్ పోర్టులోనే వదిలేసి వెళ్లింది. ఒక్కో వాహనం ధర 10 లక్షల డాలర్ల విలువ ఉంటుంది. చివరికి అమెరికా చివరిగా C-17 ట్రాన్స్ ఫోర్ట్ ప్లేన్లలో అప్ఘాన్ వీడాయని మెకంజీ తెలిపారు. సైనికులు, పౌరులతో కూడిన చివరి విమానం లార్జ్ సీ-17 కాబుల్‌లోని హమీద్ కార్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అర్ధరాత్రి బయలుదేరింది. దీంతో అఫ్గాన్‌లో సైనికులు, పౌరుల తరలింపు ప్రక్రియ పూర్తయిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ హెడ్ జనరల్ కెన్నెత్ మెకంజీ పెంటగాన్‌లో ప్రకటించారు.
US : అప్ఘాన్‌ను ఖాళీ చేసిన అమెరికా, సంబరాలు చేసుకున్న తాలిబన్లు
అఫ్ఘాన్‌లో అమెరికా ఉత్కంఠకు తెరపడింది. తాలిబన్ల డెడ్‌లైన్ ప్రకారమే.. అగ్రరాజ్యం నడుచుకోక తప్పలేదు. అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా బలగాలు వెళ్లిపోవడానికి 2021, ఆగస్టు 31వ తేదీ మంగళవారం చివరి రోజు కావడంతో తరలింపు ప్రక్రియ సోమవారం రాత్రే ముగిసింది. దీంతో తాలిబన్లు సంబరాలు చేసుకున్నారు. గాలిలో తుపాకులు, టపాసులు పేలుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. అర్థరాత్రి చివరి విమానం అఫ్ఘాన్ నుంచి బయలుదేరడంతో.. 20 ఏళ్ల తర్వాత అమెరికా రక్షణ దళాలు పూర్తిగా వెనుదిరిగాయి. ఈ విషయాన్ని అమెరికా రక్షణశాఖ కార్యాలయం ప్రకటించింది.
ఆగష్టు 31 గడువులోపే అమెరికా దళాలు అఫ్గాన్‌ను ఖాళీ చేశాయి. అయితే గత వారంలో రోజుల నుంచి కాబుల్‌లో చోటు చేసుకున్న బాంబు దాడులతో భారీ భద్రత నడుమ ఈ విమానం బయలుదేరింది. అమెరికా దళాలు, పౌరుల ఉపసంహరణలో తాలిబన్లు చాలా సహకరించారని మెకంజీ పేర్కొన్నారు. అఫ్ఘాన్‌తో అమెరికా కలిసి పనిచేస్తుందని అమెరికా సెక్రటరి బ్లింకిన్ తెలిపారు. శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తామన్నారు. అలాగే రానున్న రోజుల్లో అఫ్ఘాన్‌ను వదిలి వెళ్ళాలనుకున్న అమెరికన్లకు సాయం చేస్తామని ప్రకటించారు.
Child Rapist : అమ్మేది గుట్కాలు.. చేసేది రేప్‌లు.. ఫోన్ చూసి పోలీసులే షాక్