US : అప్ఘాన్‌‌ను ఖాళీ చేసిన అమెరికా, సంబరాలు చేసుకున్న తాలిబన్లు

తాలిబన్ల డెడ్‌లైన్‌ ప్రకారమే.. అగ్రరాజ్యం నడుచుకోక తప్పలేదు. అర్థరాత్రి చివరి విమానం అఫ్ఘాన్ నుంచి బయలుదేరడంతో.. 20 ఏళ్ల తర్వాత అమెరికా రక్షణ దళాలు పూర్తిగా వెనుదిరిగాయి.

US : అప్ఘాన్‌‌ను ఖాళీ చేసిన అమెరికా, సంబరాలు చేసుకున్న తాలిబన్లు

Afghan

Afghanistan – US : అఫ్ఘాన్‌లో అమెరికా ఉత్కంఠకు తెరపడింది. తాలిబన్ల డెడ్‌లైన్‌ ప్రకారమే.. అగ్రరాజ్యం నడుచుకోక తప్పలేదు. అఫ్ఘానిస్తాన్‌ నుంచి అమెరికా బలగాలు వెళ్లిపోవడానికి 2021, ఆగస్టు 31వ తేదీ మంగళవారం చివరి రోజు కావడంతో తరలింపు ప్రక్రియ సోమవారం రాత్రే ముగిసింది. దీంతో తాలిబన్లు సంబరాలు చేసుకున్నారు. గాలిలో తుపాకులు, టపాసులు పేలుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. అర్థరాత్రి చివరి విమానం అఫ్ఘాన్ నుంచి బయలుదేరడంతో.. 20 ఏళ్ల తర్వాత అమెరికా రక్షణ దళాలు పూర్తిగా వెనుదిరిగాయి. ఈ విషయాన్ని అమెరికా రక్షణశాఖ కార్యాలయం ప్రకటించింది.

Read More :Worrying Trend In J&K : అప్ఘాన్ లో తాలిబన్..కశ్మీర్ లో ఆందోళనకర పరిస్థితి! 

సైనికులు, పౌరులతో కూడిన చివరి విమానం లార్జ్‌ సీ-17 కాబుల్‌లోని హమీద్‌ కార్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అర్ధరాత్రి బయలుదేరింది. దీంతో అఫ్గాన్‌లో సైనికులు, పౌరుల తరలింపు ప్రక్రియ పూర్తయిందని యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ హెడ్‌ జనరల్‌ కెన్నెత్‌ మెకంజీ పెంటగాన్‌లో ప్రకటించారు.

Read More : Taliban : అప్ఘాన్ వీడిన 5లక్షల మంది..మహిళలు,చిన్నారులే ఎక్కువ!

ఆగష్టు 31 గడువులోపే అమెరికా దళాలు అఫ్గాన్‌ను ఖాళీ చేశాయి. అయితే గత వారంలో రోజుల నుంచి కాబుల్‌లో చోటు చేసుకున్న బాంబు దాడులతో భారీ భద్రత నడుమ ఈ విమానం బయలుదేరింది. అమెరికా దళాలు, పౌరుల ఉపసంహరణలో తాలిబన్లు చాలా సహకరించారని మెకంజీ పేర్కొన్నారు. అఫ్ఘాన్‌తో అమెరికా కలిసి పనిచేస్తుందని అమెరికా సెక్రటరి బ్లింకిన్ తెలిపారు. శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తామన్నారు. అలాగే రానున్న రోజుల్లో అఫ్ఘాన్‌ను వదిలి వెళ్ళాలనుకున్న అమెరికన్లకు సాయం చేస్తామని ప్రకటించారు.