Worrying Trend In J&K : అప్ఘాన్ లో తాలిబన్..కశ్మీర్ లో ఆందోళనకర పరిస్థితి!

తాలిబన్ చేతుల్లోకి అప్ఘానిస్తాన్ వెళ్లిపోయినప్పటి నుంచి కశ్మీర్ లోని ఉగ్రవాదులు తెగ సంతోషపడిపోతున్నారట. భారత్ లో ఉగ్రదాడులకు ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం.

Worrying Trend In J&K : అప్ఘాన్ లో తాలిబన్..కశ్మీర్ లో ఆందోళనకర పరిస్థితి!

Kashmir 8

Worrying Trend In J&K తాలిబన్ చేతుల్లోకి అప్ఘానిస్తాన్ వెళ్లిపోయినప్పటి నుంచి కశ్మీర్ లోని ఉగ్రవాదులు తెగ సంతోషపడిపోతున్నారట. భారత్ లో ఉగ్రదాడులకు ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం. ఇప్పటివరకు ఆరు టెర్రరిస్టు గ్రూప్ లో కశ్మీర్ వ్యాలీలోకి చొరబడ్డాయని..ఆ టెర్రరిస్టు గ్రూప్ ల అజెండాలో చాలా పెద్ద టార్గెట్ లు(లక్ష్యాలు) ఉన్నాయని నిఘా వర్గాలు తెలిపాయి.

నిఘావర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం..గడిచిన నెల రోజులుగా వివిధ సెక్యూరిటీ ఫోర్సెస్ విధులు నిర్వహిస్తున్న చోట్ల 25-30 మంది ఉగ్రవాదులు ఉన్నారు. అయితే ఇప్పటికే జమ్మూకశ్మీర్ లో ఉన్న ఉగ్రవాదుల సంఖ్యకి ఇది అదనం. గత నెల రోజులుగా జమ్మూకశ్మీర్ లో హింసాత్మక ఘటనలు గణనీయంగా పెరిగినట్లు క్షేత్రస్థాయిలోని ఆధారాల ద్వారా సృష్టమవుతోంది. గత నెల రోజులుగా ప్రతిరోజూ భద్రతా బలగాలపై ఐఈడీ దాడిగానీ లేదా రాజకీయనాయకులపై దాడులు గానీ జరుగుతున్నాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు.

ఇక,దాదాపు 300 మంది ఉగ్రవాదులు నియంత్రణ రేఖ(LOC) వెంబడి శిబిరాలను ఆక్రమించినట్లు వివిధ నిఘా సంస్థలు తెలిపాయి. అయితే తాము కూడా అప్రమత్తంగా ఉన్నామని,ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాము అని కశ్మీర్ వ్యాలీలో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్న ఒక అధికారి చెప్పారు.