Guinness World Record
Guinness World Record : రికార్డులకు ఏది అనర్హం అన్నట్లుగా ఉంది. యుఎస్‌కి చెందిన కింబర్లీ కిమికోలా అనే మహిళ ప్రపంచంలోనే అత్యంత గట్టిగా తేన్చి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. గతంలో ఉన్న రికార్డును తిరగరాసింది.
కొంతమందిలో ఏదైనా తిన్నా, తినకపోయిన తేన్పులు వస్తాయి. దాంతో ఇబ్బంది పడుతుంటారు. అంతవరకూ మనకి తెలుసు. కానీ ఈ తేన్పులతో ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టవచ్చని నిరూపించింది యుఎస్‌కి చెందిన కింబర్లీ కిమికోలా అనే మహిళ. 107.3 డెసిబుల్స్ వద్ద రికార్డైన ఆమె తేన్పు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. 2009 లో ఇటలీకి చెందిన ఎలిసా కాగ్నో 107 డెసిబుల్స్ రికార్డును కిమికోలా అధిగమించింది. ఇక జెంట్స్ విభాగంలో ప్రపచంలోనే అత్యంత పెద్ద శబ్దంతో తేన్పు ఆస్ట్రేలియాకు చెందిన సెవిల్లే షార్ప్ పేరుతో ఉంది. అతని తేన్పు 2021 లో 112.7 డెసిబుల్స్‌గా ఉంది.
తేన్పు రికార్డ్‌ను గుర్తించడానికి ఆ ధ్వనిని రికార్డింగ్ స్టూడియోలో చిత్రిస్తారు. కింబర్లీ కిమికోలా రికార్డుకి సిద్ధమైనపుడు వింటర్ కాఫీ, బీర్‌తో పాటు అల్పాహారం తిని తేన్పుకి సిద్ధమైందట. తేన్పులు బిగ్గరగా రావడం ఆమెకు చిన్నతనం నుంచి ఉందట. తన తేన్పులతో ఇప్పటికే టిక్ టాక్, యూ ట్యూబ్‌లలో మాంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.