Tierra Young Allen : పబ్లిక్ ప్లేస్‌లో గట్టిగా అరిచిందని అరెస్ట్ .. రెండు నెలలుగా జైల్లోనే టిక్ టాక్ స్టార్

గట్టిగా అరిచిందని అమెరికా మహిళను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆమె పాస్ పోర్టు, క్రెడిట్ కార్డు అన్నీ హ్యాండోవర్ చేసుకున్నారు. రెండు నెలలుగా జైల్లోనే ఉంది. ఇక ఆమె ఆ దేశం నుంచి అమెరికా రావటం కష్టమనేలా ఉంది పరిస్థితి. కేవలం అరిచినందుకే అరెస్ట్..జైలు శిక్షా..?

Us Woman Tierra Young Allen In Dubai Houston Jail

Tierra Young Allen In Dubai Houston Jail : గట్టిగా అరిస్తే అరెస్ట్ చేసిన ఓ మహిళను అరెస్ట్ చేశారు. జైల్లో పెట్టేశారు. రెండు నెలలుగా ఆమె జైల్లోనే ఉంది. ఏంటీ గట్టిగా అరెస్తే అరెస్ట్ చేసేస్తారా..? జైల్లో పెట్టేస్తారా..? అంటే అంతేమరి ఆదేశపు చట్టాలు అలా ఉంటాయి. ఇవేం చట్టాలుగా బాబూ అని ఆశ్చర్యపోతాం. చూడటానికి భూతల స్వర్గంలా ఉండే దుబాయ్ లో చట్టాలు అంత కఠినంగా ఉంటాయి మరి. అరబ్ కంట్రీస్ లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో తెలియాలంటే ఈ ఘటన గురించి తెలుసుకోవాల్సిందే. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన చట్టాలు చేయటం వాటిని ఏమాత్రం రాజీ పడకుండా అమలు చేయటంతో అరబ్ దేశాల తరువాతే ఏవైనా అనేలా ఉంటాయి అక్కడి చట్టాలు.

చోరీలు చేస్తే చేతులు, కాళ్లు నరికయటం..ఇక అత్యాచారం చేస్తే  బహిరంగంగా ఉరి వేయటం, శిరచ్ఛేదాలు అక్కడ సాధారణమైన విషయం. మన దేశంలో హత్యలు, అత్యాచారాలు చేసినవారు కూడా కేసులు, విచారణలు అంటూ దశాబ్దాల తరబడి కొనసాగుతుంటాయి. దీనికి కారణం భారతదేశ శిక్షా స్పృతి ప్రకారం వంద మంది నేరస్థులు తప్పించుకున్నా పరవాలేదు గానీ ఒక్క నిర్ధోషికి కూడా శిక్ష పడకూడదనే ఉద్ధేశం. కానీ అరబ్ దేశాల్లో అలాకాదు. అరెస్ట్, విచారణ, శిక్ష అనేవి చాలా వేగంగా జరిగిపోతాయి. అందుకే అక్కడ చిన్నపాటి తప్పుకు కూడా కఠినమైన శిక్షలుంటాయి. అటువంటిదే ఓ మహిళకు జరిగిన ఘటన.

US Recession starting soon : యూఎస్‌లో త్వరలో ఆర్థిక మాంద్యం ప్రారంభం

టియెర్రా యంగ్ అలెన్(Tierra Young Allen)… హూస్టన్ నగరం( city of Houston)లో ట్రక్ డ్రైవర్ (truck driver) గా పనిచేస్తోంది. ఆమె టిక్ టాక్ స్టార్ కూడా. ఆమె గత మే (2023) దుబాయ్ వెళ్లింది. అక్కడ స్నేహితురాలితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. కానీ ఈ ప్రమాదంలో వారి కారుకు డ్యామేజ్ బాగా జరిగినా వారిద్దరికి ఎటువంటి గాయాలు అవ్వకుండానే బయటపడ్డారు. వారు ప్రయాణించే కారు రెంట్ కు తీసుకున్నది. కానీ కారు ప్రమాద ఘటనతో టియోర్రా స్నేహితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారం తరువాత విడిచిపెట్టారు.

కారుని టియోర్రా నడుపుతోందనే కారణంతో ఆమె క్రెడిట్ కార్డులు, ఐడీ కార్డు కార్ రెంటల్ ఏజెన్సీ స్వాధీనం చేసుకుంది. వాటిని తిరిగి తీసుకోవటానికి ఆమె కార్ రెంటల్ ఏజెన్సీ వద్దకు వెళ్లింది. సదరు ఏజెన్సీ ఆమె కార్డులు తిరిగి అప్పగించే విషయంలో అక్కడి సిబ్బందిలోని ఓ వ్యక్తితో మాటా మాటా పెరిగింది. దాంతో టియెర్రా కూడా గట్టిగా అరిచింది. దీంతో టియోర్రాపై సదరు ఏజెన్సీ ఫిర్యాదు చేయటం పోలీసులు అరెస్ట్ చేయటం జరిగిపోయాయి.

America : అమెరికాలో భారతీయ విద్యార్థినిపై పిడుగుపాటు .. మెదడు,గుండెపై ప్రభావం..మృత్యువుతో పోరాటం

దుబాయ్ లో బహిరంగ ప్రదేశాల్లో పెద్ద గొంతుకతో అరవడం నేరం. మరి ముఖ్యంగా మహిళలు అలా అరవకూడదు. అది అక్కడి మహిళకు ఉండే నిబంధనకూడా. ఆ నేరం కింద టియోర్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నారు. రెండు నెలలుగా ఆమె అక్కడి జైల్లోనే ఉండిపోయింది. ఈ కేసు విచారణ పూర్తయ్యేంత వరకు టియెర్రాపై ప్రయాణ నిషేధం విధించారు. దాంతో ఆమె ఇప్పట్లో దుబాయ్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు కూడా తక్కువేనంటున్నారు దుబాయ్ చట్టాల గురించి తెలిసినవారు. దీనిపై టియెర్రా తల్లి టీనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఎదుటి వ్యక్తి తప్పు పట్ల గట్టిగా మాట్లాడడం కూడా నేరమేనా..? ఇవేం చట్టాలు..? అంటూ ప్రశ్నించారు.

కాగా.. టియెర్రా యంగ్ అలెన్ టిక్‌టాక్ పేజీకి 182,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు.ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 52,000 మంది, ఆమె ఫేస్‌బుక్ పేజీని 61,000 ఫాలోవర్స్ ఉన్నారు.కాబట్టి దుబాయ్ గానీ ఇతర గల్ఫ్ దేశాలు వెళ్లేవారు అక్కడి రూల్స్ గురించి మరి ముఖ్యంగా అక్కడి చట్టాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు అక్కడి చట్టాలపై అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం.

 

ట్రెండింగ్ వార్తలు