72 Years tattooed Person.. (1)
Alabama Schools no ‘yoga’ no‘Namaste’: యోగా..ఇప్పుడు ప్రపంచ మంతా యోగానే అనుసరిస్తోంది. ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి యోగా ఎంతగా ఉపయోగపడుతోందో ప్రపంచ దేశాలన్నీ ఇప్పటికే తెలుసుకున్నాయి. యోగా చేస్తున్నాయి. యోగా కోసం ఓ ప్రత్యేక రోజే రూపొందించారు. జూన్ 21 ప్రపంచ యోగా డేగా జరుపుకుంటున్నాం. యోగాకు ఇంత గుర్తింపు..హోదా వచ్చినా గానీ కొన్ని దేశాల్లో యోగా నిషేధంగా ఉంది. ముఖ్యంగా ముస్లిం, క్రిష్టియానిటీ ఎక్కువగా ఉండే దేశాల్లో యోగాను పాటించరు. దీనికి కారణాలు ఏవైనాగానీ యోగాను ప్రపంచమే గుర్తించింది. కానీ కొన్ని కొన్ని దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో యోగాపై నిషేధం అమలవుతూనే ఉంది.
యోగాను ఒక మాంత్రిక విద్య అని భ్రమే దీనికి కారణంగా కనిపిస్తోంది. దీంతో యోగాను దూరం పెడుతున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. యోగాను పాటిస్తున్నారు. అటువంటి ప్రాంతాల్లో అమెరికాలోని అలబామా రాష్ట్రం కూడా యోగా విషయంలో మార్పు తెచ్చింది. ఓ ఘటనే దీనికి ఉదాహరణ. అదేమంటే..అమెరికాలోని అలబామా రాష్ట్రంలోని స్కూళ్లలో యోగాపై నిషేధం అమల్లో ఉంది. ఆ స్కూళ్లల్లో యోగా నిషేధం. అంతేకాదు నమస్తే పెట్టటం పెట్టించటం కూడా నిషేధం. దీని కోసం ఏకంగా 1993లోనే ఓ చట్టమే చేశారు. అది ఈనాటికి అమలవుతూనే ఉంది.
అయితే ఈ పరిస్థితుల్లో యోగా విషయంలో మార్పు వచ్చింది అలబామా రాష్ట్రంలో. ఆ రాష్ట్ర ప్రభుత్వం యోగా ప్రాముఖ్యతను గుర్తించింది. స్కూలు విద్యార్థులకు యోగా ప్రయోజనాలు అందించాలని నిర్ణయించింది. విద్యార్ధులకు యోగా ఎంత ఉపయోగపడుతుందో గుర్తించింది. విద్యార్ధుల చదువుల్లోను..ఆటల్లోను ప్రతిభ సాధించాలంటే యోగా చాలా ఉపయోగపడుతుందని గుర్తెరిగింది. దీంతో గతంలో యోగాపై నిషేధం విధించిన చట్టాన్ని రద్దు చేసేందుకు తాజాగా మరో చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ విషయంలో చట్టసభలో ఓటింగ్ కూడా జరిగింది. 73-25 మెజారిటీతో యోగా అమలు చేయాలనే బిల్లు నెగ్గింది.
కాకపోతే ఇక్కడ మరో విషయం ఏమిటంటే..యోగాను తప్పనిసరిగా స్కూళ్లలో అమలు చేయాలనే విషయాన్ని ఆయా స్కూళ్ల యాజమాన్యాలకు వదిలేసింది. తమ తమ స్కూళ్లలల్లో యోగా నిర్వహించాలా? వద్దా? అన్నది స్కూలు యాజమాన్యమే నిర్ణయించుకునేలా ఈ చట్టం రూపొందింది.
యోగా గురించి చట్టం బిల్లుకు సంబంధించి జరిపిన చర్చ సందర్భంగా చట్టసభలో సభ్యులు యోగా గురించి మాట్లాడారు. ‘యోగా అనేది మన వద్ద నిషేధంలో ఉందని జిమ్ టీచర్లందరికీ తెలుసు. అయితే ఈ యోగా ప్రాముఖ్యం గురించి తెలిసి కొందరు జిమ్ టీచర్లు క్లాస్ రూముల్లో పిల్లలతో యోగా చేయిస్తున్నారని నాకు తెలుసు. దీని వల్ల మానసిక ఉల్లాసం కలుగుతోంది.‘ అని డెమోక్రటిక్ నేత జెర్మీ గ్రే తెలిపారు.
తాను కూడా ఏడేళ్లుగా యోగాను చేస్తున్నాననీ..యోగా చేస్తున్నప్పటినుంచీ తనకు మనసు హాయిగా ఉంటోందని తెలిపారు. ఆయనతో పాటు పలువురు సభ్యులు కూడా ఇంచుమించు అటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీంతో యోగా అనేది శారీరక, మానసికి ఆరోగ్యానికి చాలా మంచిది అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో బిల్లు కూడా ఈజీగా పాస్ అయ్యింది. చట్టం రూపం దాల్చింది.