ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న సత్పాల్ మహారాజ్ డెహ్రాడూన్ లో మాట్లాడుతూ… గల్వాన్ వ్యాలీలోని చైనా సైనికులు భారత సైనికులపై దాడి చేయడం ద్వారా వారి పిరికితనం, హానికరమైన చర్యలను రుజువు చేశాయనిఅన్నారు. విస్తరణవాద భావజాలాన్ని అమలు చేయడానికి మన సరిహద్దులు దాటి వెళ్లాలనే ఉద్దేశం ఏ దేశానికీ మంచిది కాదు. గల్వాన్ లోయలో భారత దళాలు తిరిగి పోరాడి శత్రువులకు తగిన సమాధానం ఇచ్చాయని, రావణుడి విస్తరణవాద ఆలోచన అతడి పతనానికి దారితీసిన విషయం మనకు తెలిసిందేనన్నారు.
ఈ విషయం వారికి చెప్పేందుకే జిన్ పింగ్ కు రామాయణం పుస్తకాన్ని పంపించానని తెలిపారు. ఇకనైనా తమ విస్తరణవాద ఆలోచనను చైనా మానుకోవాలని సత్పాల్ మహారాజ్ హితవుపలికారు. రావణుడి నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఆయన సూచించారు. విస్తరణవాద ఆలోచన వల్లనే దశ కంఠ రావణుడు అంతమయ్యాడని ఆయన అన్నారు. అందువల్ల చైనా పాలకులు ఈ ఇతిహాసం నుంచి గుణపాఠం నేర్చుకోవాలని సత్పాల్ మహారాజ్ తెలిపారు.
Read Here>>కామాంధుడు…ఆవుపై అత్యాచారం…