×
Ad

Earthquake : భారీ భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు.. ఊగిపోయిన భవనాలు.. వీడియోలు వైరల్

Venezuela Earthquake : వెనిజులాలో భారీ భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది.

Venezuela Earthquake

Venezuela Earthquake : వెనిజులాలో భారీ భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది.

Also Read: Afghan Boy First Photo: విమానం ల్యాండింగ్‌ గేర్‌లో దాక్కుని.. ప్రాణాంతక ప్రయాణం చేసింది ఈ కుర్రాడే.. ఫస్ట్ ఫోటో..

ఎన్సీఎస్ ప్రకారం.. గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. భూకంపం ప్రభావంతో పలు ప్రాంతాల్లోని ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఆస్తి, ప్రాణ నష్టంపై ఇంకా స్పష్టత రాలేదు.

జులియా రాష్ట్రంలోని మెనే‌గ్రాండే ప్రాంతంకు తూర్పు-ఈశాన్య దిశలో 24 కిలోమీటర్ల (15 మైళ్ళు) దూరంలో, రాజధాని కారకాస్ కు పశ్చిమాన 370మైళ్లు (600 కిలోమీటర్లు) కంటే ఎక్కువ దూరంలో భూకంప కేంద్రం ఉందని ఏజెన్సీ తెలిపింది. భూకంపం ఐదు మైళ్లు (7.8కిలో మీటర్లు) లోతులో ఉందని ఏజెన్సీ నివేదించింది. మెనే ‌గ్రాండే దేశ చమురు పరిశ్రమకు ముఖ్యమైన ప్రాంతమైన మారకైబో సరస్సుకు తూర్పున ఉంది.


వెనిజులా‌లోని అనేక రాష్ట్రాలతోపాటు పొరుగున ఉన్న కొలంబియా, కరీబియన్ నెదర్లాండ్స్, కరసౌ, అరుబాలతోపాటు మొత్తం ఆరు దేశాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ముఖ్యంగా వెనిజులా, కొలంబియాలో భూకంప తీవ్రత ఎక్కువగా కనిపించింది. సరిహద్దుకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లోని నివాస, కార్యాలయ భవనాలను చాలా మందిని ఖాళీ చేయించారు.