ఆరుగురు పిల్లలను కనండి..దేశానికి మంచిది

  • Publish Date - March 6, 2020 / 07:47 AM IST

చిన్న కుటుంబం..చింతలేని కుటుంబం అంటుంటారు. ముగ్గురు వద్దు..ఇద్దరే ముద్దు అని కొన్ని దేశాలు పేర్కొంటుంటాయి. జనాభా దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తుంటాయి. కానీ చాలా మంది మగ సంతానం లేదనో..ఆడ పిల్ల కావాలని అనుకుని..ఎక్కువ మందికి జన్మనిస్తుంటారు. దీనివల్ల ఆయా దేశాల జనాభా అనుగుణంగా పెరుగుతుంటుంది.

జనాభాను నియంత్రణలో ఉంచేందుకు పలు చర్యలు తీసుకుంటున్నాయి. కానీ..కొన్ని దేశాలు మాత్రం తమకు జనాభా కావాలని కోరుకుంటున్నాయి. ఆర్థిక సమస్యలతో విలవిలలాడిన వెనిజుల దేశం..ఇప్పుడు జనాభా కావాలంటోంది. అధిక మంది పిల్లలను కనాలంటూ…ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది. ఒక్కరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా 6 మంది పిల్లలను కనాలని ఆయన కోరుతున్నారు. దీనివల్ల దేశానికి మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

అందుకే ప్రతి మహిళా..ఈ పని చేయాలంటున్నారు. గత సంవత్సరం 11 వేల 466 మంది పిల్లలు మరణించినట్లు, శిశు మరణాల్లో 30 శాతం పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆసుపత్రులు పనిచేయడం లేదు..టీకాల కొరత ఉందని, పౌషకాహార లోపం ఉండడం వల్ల తల్లులు పిల్లలకు పాలివ్వలేని పరిస్థితి ఏర్పడిందని ప్రతిపక్ష రాజకీయ నాయకుడు ట్వీట్ చేశారు. ముదురో వ్యాఖ్యలను అక్కడి మహిళా సంఘాలు వ్యతిరేకించాయి. 
 

See Also | కోహినూరు వజ్రం.. కోర్టు విడిచి పోతుంది : నల్లకోటు నీరాజనం