Viral Video: విమానంలో పాము.. వణికిపోయిన ప్రయాణికులు.. వీడియో

విమానంలోకి పాము రావడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇటువంటి ఘటన..

ఎయిర్‌ఏషియా థాయిలాండ్ విమానంలో పాము కనపడడంతో ప్రయాణికులు వణికిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బ్యాంకాక్‌ నుంచి ఫుకెట్‌కి బయలుదేరిన విమాన ఓవర్‌హెడ్ లగేజీ బిన్‌లో ఓ చిన్నపాటి పాము కదులుతుండడాన్ని ప్రయాణికులు గమనించారు.

చివరకు ఆ పామును ఓ ప్లాస్టిక్ కవర్‌లో వేసి సిబ్బంది తీసుకెళ్లారు. ఈ ఘటన జనవరి 13న బ్యాంకాక్‌లోని డాన్ ముయాంగ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎఫ్‌డీ3015 విమానంలో జరిగింది. ముందుగా వాటర్ బాటిల్‌తో పామును బంధించడానికి విమాన సిబ్బంది ప్రయత్నించాడు.

అది అందులోకి రాకపోవడంతో ప్లాస్టిక్ కవర్‌లో దాన్ని వేసుకుని తీసుకెళ్లాడు. విమానంలోకి పాము రావడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇటువంటి ఘటన మరోసారి చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికులకు పాముల వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు.

Gold Rate Today : బంగారం కొనుగోలుకు ఇదే మంచి సమయం.. వరుసగా మూడోరోజు భారీగా తగ్గిన గోల్డ్ ధర

ట్రెండింగ్ వార్తలు