Gold Rate Today : బంగారం కొనుగోలుకు ఇదే మంచి సమయం.. వరుసగా మూడోరోజు భారీగా తగ్గిన గోల్డ్ ధర

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర మళ్లీ తగ్గింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణంలలో ..

Gold Rate Today : బంగారం కొనుగోలుకు ఇదే మంచి సమయం.. వరుసగా మూడోరోజు భారీగా తగ్గిన గోల్డ్ ధర

Gold

Gold And Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారా? అయితే, మీకు గుడ్ న్యూస్. వరుసగా మూడోరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 300 తగ్గగా, 24 క్యారెట్ల బంగారంపై రూ. 330 తగ్గింది. మూడు రోజుల్లోనే 10గ్రాముల బంగారంపై సుమారు రూ. 820 తగ్గుదల చోటు చేసుకుంది.

Gold Price Today

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర మళ్లీ తగ్గింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 57,400 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 62,620గా నమోదైంది.

Gold Price Today

  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,550 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 62,770 వద్ద కొనసాగుతుంది.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,620 వద్ద కొనసాగుతుంది.
    చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.57,800 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.63,050గా నమోదైంది.

Gold Price Today

  • తగ్గిన వెండి ధర ..
    దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధర తగ్గింది. తాజాగా కిలో వెండిపై రూ. 400 తగ్గింది. వరుసగా మూడు రోజుల్లో కిలో వెండిపై రూ. 1300 తగ్గుదల చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 77,000 గా నమోదైంది.
    దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,000కాగా.. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి రూ.75,500కు చేరింది. బెంగళూరులో వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ. 750 తగ్గుదల చోటు చేసుకుంది. దీంతో అక్కడ ప్రస్తుతం కిలో వెండి ధర రూ.73,000 వద్ద కొనసాగుతోంది.

 

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 6గంటలకు నమోదైనవి. బంగారం ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.