ఇంటర్నెట్ షాక్ : హత్తుకుని మృగరాజుకు ముద్దెట్టాడు!

  • Publish Date - January 15, 2020 / 10:15 AM IST

టార్జన్.. వైల్డ్ స్టోరీల్లోనే చూసింటారు.. రియల్ లైఫ్ లో కూడా ఓ టార్జన్ ఉన్నాడు.. అడవిలోని జంతువులన్నింటికి అతడే ప్రియ మిత్రుడు. సింహాలకు వాటి కూనలకు అన్నితానై సాయపడుతుంటాడు. జంతువుల కష్టాలను తీర్చేవాడిలా ముందుంటాడు. కానీ, కేవలం అది వైల్డ్ స్టోరీల్లోనే.. నిజ జీవితంలో అది సాధ్యమేనా? అంటే కాదు అని అంటారు.. ఇతన్ని చూస్తే మీ అభిప్రాయం మార్చేసుకుంటారు.. నిజానికి ఇతడో టార్జన్.. సింహాల జూలుతో ఓ ఆట ఆడుకుంటాడు.. ఒక సింహం ఎదురుపడితేనే పైప్రాణాలు పైకి పోతాయి..

అలాంటిది సింహాలు గుంపులో ధైర్యంగా ఏమాత్రం బెరుకు లేకుండా ఎలా కూర్చున్నాడో చూడండి.. అతడే.. స్విడ్జర్లాండ్‌కు చెందిన డీన్ షెచ్నిడర్.. వైల్డ్ లైఫ్ వర్కర్.. సింహాలంటే పిచ్చి.. ఇతడంటే కూడా సింహాలకు మచ్చిక.. చూస్తే చాలు.. వెంటనే వచ్చి అతనిపై దూకేస్తాయి ఆకలితో కాదు.. ప్రేమతో.. హగ్ ఇస్తాయి.. ముద్దులు పెడతాయి..

ఒక నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోను చూసిన నెటిజన్ల గుండెల్లో గుభేల్ అంటోంది.. వామ్మో.. సింహాలతో స్నేహామా? అంటూ షాక్ అవుతున్నారు.. సింహాలతో ఆడుతున్న అతడిని చూసి అవి పాపం తమ బేబీ అనుకుంటున్నాయోమో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.