Dog Viral Video : వీడియో గేమ్ ఆడుతున్న శునకం .. కంప్యూటర్ ఆఫ్ చేయగానే దాని రియాక్షన్ చూడండి

శునకాలు మనం ఏది నేర్పితే అది ఇట్టే గ్రహిస్తాయి. ఓ శునకం కంప్యూటర్‌లో వీడియో గేమ్ ఆడుతోంది. దాని యజమాని కంప్యూటర్ ఆఫ్ చేయగానే దాని ఎక్స్ ప్రెషన్ చూడండి. షాకవుతారు.

Dog Viral Video

Dog Viral Video : సెల్ ఫోన్‌లో అయినా.. కంప్యూటర్‌లో అయినా.. టీవీలో అయినా మనం ఏదైనా సీరియస్ గా వాచ్ చేస్తున్నప్పుడో .. ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడో ఎవరైనా డిస్ట్రబ్ చేస్తే ఇరిటేషన్ వచ్చేస్తుంది. వెంటనే వారిపై కోపం ప్రదర్శిస్తాం. కానీ ఓ శునకం ప్రతాపం చూస్తే షాకవుతారు. శ్రద్ధగా అది వీడియో గేమ్ ఆడుతుంటే కంప్యూటర్ ఆఫ్ చేసారని అదేం చేసిందో చూడండి.

Kakinada : హృదయ విదారక ఘటన.. యజమాని చనిపోయిందని తెలీక ఆమె చెప్పుల దగ్గర కాపలా కాస్తున్న శునకం

శునకాలు చాలా తెలివైనవి. మనుష్యులతో ఎంతో విశ్వాసంగా ఉండటంతో పాటు ఏది నేర్పినా ఇట్టే గ్రహించేస్తాయి. అంతే కాదు ఒక్కోసారి మనుష్యుల్లాగే భావోద్వేగాలు ప్రదర్శిస్తాయి. animal____house అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియోలో ఓ శునకం సీరియస్‌గా కీ బోర్డ్ ఉపయోగించి వీడియో గేమ్ ఆడుతోంది. దాని యజమాని కంప్యూటర్ ఆఫ్ చేశాడు. ఇక చూడండి .. దాని ప్రతాపం. కీ బోర్డ్‌ను ఒక్క తోపు తోసింది. దాని మొహంలో ఎంతో కోపం, నిరాశ కూడా కనిపించాయి. ‘ముగింపు కోసం వేచి ఉండండి’ అనే శీర్షికతో షేర్ చేసిన ఈ వీడియో ముగింపు కూడా భలే నవ్వు తెప్పించింది. మిలియన్ల సంఖ్యలో దూసుకుపోతున్న ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు పెట్టారు.

Dog helping woman : మహిళతో పాటు చెత్తా చెదారం మోసిన శునకం.. ఇలాంటి పనులు చేయంచడం తప్పంటున్న నెటిజన్లు

‘శునకానికి బాగా కోపం వచ్చినట్లుంది’ అని.. ‘దానిని ఎందుకు డిస్ట్రబ్ చేశారు?’ అంటూ ఫన్నీ ఎమోజీలతో కామెంట్లు పెట్టారు. ఏమైనా తన ఎమోషన్‌తో ఆ శునకం నెటిజన్ల మనసు దోచుకుంది.