Japanese man Viral Video
Japanese man Viral Video : ఎక్కడ విన్నా.. ఏ రీల్స్ చూసినా ‘జైలర్’ లోని ‘కావాలా’ సాంగ్ మారుమోగిపోతోంది. ఈ పాటకు ఓ జపాన్ యువకుడు చేసిన డ్యాన్స్ వీడియో తాజాగా వైరల్ అవుతోంది.
సూపర్ స్టార్ రజనీకాంత్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటించిన ‘జైలర్’ సినిమాలోని పాట ‘కావాలా’ సెన్సేషన్ రేపుతోంది. ఈ హిట్ నంబర్‌కు చాలామంది రీల్స్, వీడియోలు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. తాజాగా kaketaku.japan అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ‘“కావాలా ఫ్రమ్ జపాన్” అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో జపనీస్ కుర్రాడు వేసిన స్టెప్పులను నెటిజన్లు ఇష్టపడుతున్నారు. ‘ఈ పాటకు బెస్ట్ వెర్షన్’.. అద్భుతమైన కొరియోగ్రఫీ’ అంటూ కాంప్లిమెంట్లు ఇస్తున్నారు.
‘జైలర్’ పాట ‘కావాలా’ లో తమన్నా సూపర్ కూల్ మూమెంట్స్ ఇంటర్నెట్‌ను మంత్రముగ్ధులు చేశాయి. ఆమె కర్లీ హెయిర్ లుక్‌తో.. హుక్ స్పెప్స్‌తో డ్యాన్స్ అదరగొట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సాంగ్ ఫీవర్ కొనసాగుతోంది.