Jailer Collections : ఆరు రోజుల్లోనే కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాని బీట్ చేసేసిన జైలర్.. సూపర్ స్టార్ రికార్డ్..

జైలర్ సినిమా ఆరు రోజుల్లోఈ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 410 కోట్లకు పైగా వసూలు చేసింది.

Jailer Collections : ఆరు రోజుల్లోనే కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాని బీట్ చేసేసిన జైలర్.. సూపర్ స్టార్ రికార్డ్..

Rajinikanth Jailer Cinema cross Kamal Haasan Vikram Movie life time collections

Updated On : August 16, 2023 / 12:38 PM IST

Jailer Collections :  సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్’(Jailer) సినిమా ఆగస్టు 10న గ్రాండ్ గా రిలీజయి భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో త‌మ‌న్నా (Tamannaah), కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్‌ మోహన్ లాల్(Mohanlal), జాకీ ష్రాఫ్, సునీల్.. లాంటి స్టార్ యాక్టర్స్ కీల‌క పాత్ర‌ల్లో నటించారు.

తమిళనాడులోనే కాక అన్నిచోట్లా జైలర్ సినిమా భారీ విజయం సాధించింది. జైలర్ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మొదటి వీకెండ్ ని జైలర్ సినిమా బాగా ఉపయోగించుకుంది. భోళా శంకర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం, పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో జైలర్ కి మరింత కలిసి వచ్చింది. జైలర్ సినిమా ఆరు రోజుల్లోఈ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 410 కోట్లకు పైగా వసూలు చేసింది. అంటే ఆల్మోస్ట్ 200 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది జైలర్ సినిమా.

Vijay Devarakonda : సమంత మాట్లాడటం మానేసింది.. 60 శాతం షూట్ అయ్యాక సమంత హెల్త్ ప్రాబ్లమ్ వల్ల సినిమా ఆగిపోయింది

జైలర్ సినిమా ఇప్పటికే అన్ని ఏరియాల్లోను బ్రేక్ ఈవెన్ చేసింది. తెలుగులో కూడా ఫుల్ గా లాభాలు వచ్చాయి. ఇప్పట్లో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. అయితే జైలర్ సినిమా కమల్ హాసన్ విక్రమ్ సినిమా రికార్డ్ ని ఆరు రోజుల్లోనే దాటేసింది. కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. విక్రమ్ సినిమా ఫుల్ కలెక్షన్స్ 402 కోట్లు. ఈ కలెక్షన్స్ ని రజినీకాంత్ జైలర్ ఆరు రోజుల్లోనే దాటేసింది. దీంతో ఇప్పుడు మరోసారి కమల్ వర్సెస్ రజిని అని తమిళ్ లో చర్చలు చేస్తున్నారు. ఇక అమెరికాలో కూడా ఇప్పటికే మూడు మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది జైలర్ సినిమా.