కొత్త ఏడాదిలో సరికొత్త ఛాలెంజ్ లతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు నాలుగు తరాలకు చెందిన చైనా కుటుంబాలు. బర్డ్ బాక్స్ ఛాలెంజ్ పేరుతో నిర్వహించిన ఈ సరదా ఈవెంట్ లో నాలుగు తరాల కుటుంబ సభ్యులు కలిసి పాల్గొని ఫొటోలకు ఫొజులిచ్చారు.
కొత్త ఏడాదిలో సరికొత్త ఛాలెంజ్ లతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు నాలుగు తరాలకు చెందిన చైనా కుటుంబాలు. బర్డ్ బాక్స్ ఛాలెంజ్ పేరుతో నిర్వహించిన ఈ సరదా ఈవెంట్ లో నాలుగు తరాల కుటుంబ సభ్యులు కలిసి పాల్గొని ఫొటోలకు ఫొజులిచ్చారు. జనవరి నెలలో ఇప్పటివరకూ వైరల్ అయిన ఫొటోల్లో ఫిజి వాటర్ గ్లర్ మెమో తొలి ఫొటోగా నిలిచింది. మరోవైపు చైనాలో నాలుగు తరాలకు చెందిన కుటుంబాల వీడియోలు, ఫొటోలు కొన్నిరోజులుగా ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్నాయి.
నాలుగు తరాల ఛాలెంజ్ లో భాగంగా.. నేటి తరం.. ముందటి తరం వాళ్లని పిలవడం.. వారు ఆ ముందటి తరం వారిని పిలవడం ఇలా ఒకరి తరువాత మరొకరు బయటకు వచ్చి వీడియోలు, ఫొటోలకు ఫొజులిస్తూ సందడి చేశారు. నాలుగు తరాలు కలిసి ఒకచోట కలిసిన వీడియో ప్రస్తుతం సోషల్ ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరూ తమ కుటుంబ బాంధవ్యాలను కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ సరదా ఛాలెంజ్ కు నిర్వహించినట్టు చైనా కుటుంబాలు చెబుతున్నాయి. ఎంత బాగుందో కదా? మీరూ కూడా చూడండి.
this Chinese four generations meme is so wholesome omg pic.twitter.com/bozR6rB93w
— kassy cho (@kassy) January 4, 2019
It’s all so pure pic.twitter.com/iNsBV0lmAH
— kassy cho (@kassy) January 4, 2019