Ivanka Trump
Ivanka Trump – Viral Video: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కూతురు ఇవాంకా ట్రంప్ (41) సర్ఫింగ్ నైపుణ్యాలు ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
మయామి బీచ్‌లో వేక్‌బోర్డింగ్ చేస్తూ చాలా హుషారుగా ఇవాంకా ట్రంప్ కనపడ్డారు. ఆ సమయంలో ఇవాంకా ట్రంప్ కుమారుడు థియో (7) బోటులో కూర్చుని ఉన్నాడు. తన తల్లి సర్ఫింగ్ చేస్తుంటే చాలా ఆసక్తికరంగా చూస్తూ ఉండిపోయాడు. ఎల్లో కలర్ వన్-పీస్ స్విమ్ సూట్, బ్లాక్ లైఫ్ జాకెట్, బేస్ బాల్ క్యాప్ పెట్టుకుని ఇవాంకా ట్రంప్ కనపడ్డారు.
ఇవాంకా ట్రంప్ జూన్‌లోనూ బ్లాక్ స్విమ్సూట్ లో సర్ఫింగ్ చేశారు. అప్పట్లోనే ఫొటోలు వైరల్ అయ్యాయి. అమెరికాలో వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంది. పోటీ చేస్తానని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఈ సారి తాను రాజకీయాల్లో ఏ మాత్రం జోక్యం చేసుకోనని ఇవాంకా ట్రంప్ ప్రకటించారు. ప్రచారంలో పాల్గొనబోనని ఇప్పటికే స్పష్టం చేశారు.
Pakistan : ఐఎస్ఐ సాయం కోరిన టిక్ టాక్ స్టార్.. తన భర్త కిడ్నాప్ అయ్యారంటూ..