ఉడికించిన కోడిగుడ్డు పెంకు తీయాలంటే కొంత కష్టపడాల్సిందే. సాధారణంగా.. గుడ్డు కాస్త చల్లారిన తర్వాత వేడి తగ్గాక దాన్ని చేతిలోకి తీసుకుంటారు. ఆ తర్వాతే పెంకు తీస్తారు. దీనికి
ఉడికించిన కోడిగుడ్డు పెంకు తీయాలంటే కొంత కష్టపడాల్సిందే. సాధారణంగా.. గుడ్డు కాస్త చల్లారిన తర్వాత వేడి తగ్గాక దాన్ని చేతిలోకి తీసుకుంటారు. ఆ తర్వాతే పెంకు తీస్తారు. దీనికి కొన్ని నిమిషాల సమయం పడుతుంది. కానీ.. వేడి వేడి కోడిగుడ్డు పెంకుని కేవలం క్షణాల్లోనే తీయొచ్చని మీకు తెలుసా. దానికి ఓ మంచి టెక్నిక్ ఉందని మీరు ఎప్పుడైనా విన్నారా..
అవును.. ఉడికించిన కోడిగుడ్డు పెంకు తీయడం చాలా సులువు. జస్ట్ సెకన్లలో వ్యవధిలో పెంకు తీయొచ్చు. దీనికి సంబంధించి ఓ వ్యక్తి పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుడ్లను ఉడికించిన తర్వాత తీసి ఓ గ్లాసులో వేశాడు. అందులో కొన్ని చల్లటి నీటిని పోసి…గ్లాసును మూసి షేక్ చేశాడు. కొన్ని సెకన్ల తర్వాత షేక్ చేయడం ఆపేసి గుడ్డును బయటకు తీసి పెంకు తీస్తే ఎంతో సులువుగా ఊడింది. ఇదంతా కేవలం 10 సెకన్లలో జరిగింది. ఈ ఐడియా నెటిజన్లను బాగా అట్రాక్ట్ చేసింది. వావ్ సూపర్ అని కామెంట్ చేస్తున్నారు. ఏం ఐడియా గురూ అని మెచ్చుకుంటున్నారు. ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు.
Apparently I’ve been cracking open hard boiled eggs wrong all this time… who knew? ? pic.twitter.com/hz6eNnWUkc
— Madeyousmile (@Thund3rB0lt) January 5, 2020
ఈ ఐడియా లైఫ్ చేంజింగ్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
Literally life changing #MondayMorning
— Sharon Rues (@sharon_rues) January 6, 2020
Also Read : బట్టతలని బాధపడకండి.. అమ్మాయిలను ఆకర్షించే సెక్సీలు మీరే!
మెచ్చుకునే వాళ్లే కాదు.. విమర్శించే వాళ్లూ ఉన్నారు. ఈ ఐడియా కరెక్ట్ కాదంటున్నారు కొందరు నెటిజన్లు. ఈ పని వల్ల నీరు వృథా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాప్ బంద్ చేయడం మర్చిపోతే… నీరంతా వేస్ట్ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Dont forget to close it!!! Dont waste water!!!
— alhamdulillah still bahtiar (@sanskuypars) January 5, 2020
Great idea but turn off the tap
— Sue Garvey (@SueGarvey3) January 6, 2020
సేవ్ వాటర్ ఫస్ట్ అని మరొక నెటిజన్ కామెంట్ చేశాడు.
Save the water first…
— ☠ Panji Alattas (@PanjiAlattas) January 6, 2020