Injured Deer Runs to Hospital : కారు ఢీకొని గాయాలు..ఆసుపత్రికి వచ్చి మరీ చికిత్స చేయించుకున్న జింక
ఓ జింక రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఓ కారు దాన్ని ఢీకొంది. దీంతో జింకకు గాయాలయ్యాయి. గాయపడిన ఆ జింక ఆస్పత్రికి వెళ్లి మరీ చికిత్స చేయించుకున్న వీడియో వైరల్ అవుతోంది.
- nagamani
- Published On : November 18, 2021 / 04:49 PM IST
Injured Deer Runs Into Hospital
Injured Deer Runs Into Hospital : ఓ జింక రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఓ కారు దాన్ని ఢీకొంది. దీంతో జింకకు గాయాలయ్యాయి. సాధారణంగా అలా గాయపడిన జంతువులు కుంటు కుంటు వాటిదారిన అవి వెళ్లిపోతాయి. లేదంటే మూలుగుతు ఎక్కడో అక్కడ బాధపడుతు పడి ఉంటాయి. లేదంటే కొంతమంది పెద్ద మనస్సు చేసుకుని వాటికి చికిత్స చేయిస్తారు. కానీ ఈ జింక వెరీ డిఫరెంట్. కారు ప్రమాదంలో గాయపడిన ఆ జింక అలా కుంటుతు ఉండిపోలేదు. ఓ హాస్పిటల్ కు వెళ్లి మరీ చికిత్స చేయించుకుంది. అచ్చం మనిషి ఆస్పత్రికి వచ్చి చికిత్స చేయించుకుంది.
ఈ వింత ఘటన వివరాల్లోకి వెళితే..అమెరికాలో ఒక జింకను కారు ఢీ కొట్టింది. పాపం ఆ జింకకు గాయాలయ్యాయి. దాంతో జింక వెంటనే సమీపంలోని లూసియానాలో ఉన్న పశువుల ఆస్పత్రికి వెళ్లింది. లూసియానాలో ఉన్న బాటన్ రూజ్‌లోని అవర్ లేడీ ఆఫ్ ది లేక్ రీజనల్ మెడికల్ సెంటర్‌లోకి వెళ్లి మరీ చికిత్స్ చేయించుకుంది. ఇంకా విచిత్రమేమంటే..చికిత్స కోసం ఆ మెడికల్ సెంటర్‌లో అటూ ఇటు పరిగెడుతూ చాలా కష్టపడింది. పాపం నడవలేక ఎస్కలేటర్ గానీ..లిఫ్టు గానీ కనిపిస్తుందేమో తెలుసుకోవటానికేమో..నిజమే అన్నట్లుగా దానికి అక్కడే ఉన్న ఓ ఎస్కలేటర్ కనిపించింది. ఆ ఎస్కలేటర్ ఎక్కి మరీ మరీ రెండో అంతస్తుకి చేరుకుంది.
ఓ జింక గాయాలతో మెడికల్ సెంటర్ కు రావటంతో అదికూడా ఎస్కలేటర్ ఎక్కి మరీ డాక్టర్లు ఉన్నచోటికి రావటం చూసిన డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బందితో పాటు హాస్పత్రికి వచ్చినవారు కూడా ఆశ్చర్యపోయారు.కుంటుతు నడుస్తున్న ఆ జింకను జింకను పరిశీలించిన పశువైద్యుడు దానికి వైద్యం చేశారు. మా వైద్యులు ఎప్పుడూఅందుబాటులో ఉంటాం అంటూ అవర్ లేడీ ఆఫ్ లేక్ రజినల్ మెడికల్ సెంటర్ చెప్పుకొచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Viral Video Watch Injured Deer Runs Into Hospital
