ఆరేళ్ల సర్వీసుకు Phd అందుకున్న లాబ్రోడర్ కుక్క

వెటర్నరీ మెడిసిన్‌లో 8సంవత్సరాల వయస్సున్న లాబ్రొడర్ జాతికి చెందిన కుక్క పీహెచ్‌డీ సాధించింది. Virginia Tech’s Cook Counseling Centerలో 2014 నుంచి థెరఫీ కుక్కగా సర్వీస్ అందిస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా సేవలందుకుంటున్న వర్జినీయి మ్యారిలాండ్ కాలేజి ఆఫ్ వెటర్నరీ మెడిసిన్ దానికి పీహెచ్‌డీతో గౌరవించింది.
ఈ క్రమంలో మూసే అనే పేరున్న ఈ కుక్కకు శుక్రవారం పీహెచ్ డీతో సత్కరించారు. వేల మంది విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చే సమయంలో మూసె దాని యజమాని ట్రెంట్ డేవిస్ తో కలిసి పాల్గొంటూ వస్తుంది. ‘ఇలా కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా మరింత కంఫర్ట్ గానూ.. మంచి నమ్మశక్యంగా ఉంటుందని అంటున్నారు.
దురదృష్టవశాత్తు మనుషుల కంటే కుక్కలే కౌన్సిలింగ్ ఇవ్వడంలో సేఫ్ గా వ్యవహరిస్తాయి. ఫిబ్రవరిలో మూసెకు ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చినట్లు నిర్థారించారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఆ కుక్కకు ట్రీట్ మెంట్ జరుగుతుందని వైద్యులు అంటున్నారు. కుక్కకు థెరఫీ బాగానే జరుగుతుందని.. సిబ్బందికి బాగానే సహకరిస్తుందని వైద్యులు అంటున్నారు.
మామూలు టైంలో మూసె స్విమ్మింగ్, టగ్ ఆఫ్ వార్, తినడం వంటివి చేస్తూ ఉంటుంది. ఇదే కాకుండా డిప్లమో అందుకోవడంతో పాటు, 2019 వర్జీనియా వెటర్నరీ మెడికల్ అసోసియేషన్స్ యానిమల్ హీరో గౌరవం కూడా దక్కించుకుంది.