కరోనా వైరస్‌ 10 రకాలుగా మారుతుంది.. ఆ ఒక రకమే ప్రపంచాన్ని వణికిస్తోంది : రీసెర్చర్ల స్టడీ

కొత్త కరోనా వైరస్ మొదటిసారిగా చైనాలో డిసెంబర్ 2019లో ఆవిర్భవించింది. అప్పటినుంచి కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. వేగంగా వ్యాప్తిచెందుతూ మిలియన్ల మందికి సోకుతోంది.. లక్షల మంది ప్రాణాలు తీస్తోంది. సాధారణంగా కరోనా వైరస్ 10 రకాలుగా పరివర్తనం చెందుతుంది. అందులో ఒకరకం A2a మాత్రం మిగతా రకాలపై భౌగిళిక ప్రాంతాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తోందని భారతీయ సంస్థ నిర్వహించిన ప్రపంచ అధ్యయనంలో వెల్లడించింది.

కొత్త కరోనా వైరస్ మొదటిసారిగా చైనాలో డిసెంబర్ 2019లో ఆవిర్భవించింది. అప్పటినుంచి కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. వేగంగా వ్యాప్తిచెందుతూ మిలియన్ల మందికి సోకుతోంది.. లక్షల మంది ప్రాణాలు తీస్తోంది. సాధారణంగా కరోనా వైరస్ 10 రకాలుగా పరివర్తనం చెందుతుంది. అందులో ఒకరకం A2a మాత్రం మిగతా రకాలపై భౌగిళిక ప్రాంతాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తోందని భారతీయ సంస్థ నిర్వహించిన ప్రపంచ అధ్యయనంలో వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ లోని కల్యాణిలో  National Institute of Biomedical Genomics నుంచి నిధాన్ బిశ్వాస్, పార్థా ముజ్మేందర్ ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.

పీర్ రివ్యూ చేసిన మెడికల్ జనరల్ అయిన భారతీయ జనరల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో భారతీయ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రచురించనుంది. కొత్త కరోనా వైరస్ A2a రకంతో మానువుడి ఊపిరితిత్తుల్లోని పెద్ద సంఖ్యలో ఉన్న కణాల్లోకి ప్రవేశించి అత్యధిక ప్రభావం చూపిస్తుంది. గతంలో 10 ఏళ్ల క్రితం SARS-CoV వైరస్ 8000 మందికి వ్యాపించగా, 800 మందిని పొట్టనపెట్టుకుంది. ఇది కూడా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించింది. కానీ, A2a ప్రోటీన్ మాదిరిగా ప్రభావవంతంగా ఒకరినుంచి మరొకరికి వ్యాపించలేదు.

కొవిడ్-19 వైరస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అత్యధికంగా ప్రబలిందని రచయితలు రాశారు. ప్రత్యేకమైన లక్ష్యంతో పనిచేసే వ్యాక్సీన్ తయారీదారులకు ఈ అధ్యయనం కీలకంగా మారనుంది. కరోనా వైరస్ లోని ఈ 10 రకాలు నాలుగు నెలల్లోనే వాటి పూర్వరూపమైన ‘O’ పూర్వ రకం నుంచి ఉద్భవించాయి. ప్రపంచంలో మార్చి నెలాఖరకు A2a ఇతర రకాల కణాలను అధిగమించడం ప్రారంభించింది. SARS-CoV2 రకమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని Majumder తెలిపారు.

GISAIDకి చెందిన పబ్లిక్ డేటాబేస్ నుంచి ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 పరిశోధకులు షేర్ చేసిన RNA సీక్వెన్స్ డేటాను NIBG రీసెర్చర్లు ఉపయోగించారు. ఇందులోని డిసెంబర్ 2019 నుంచి ఏప్రిల్ 6, 2020 వరకు 55 దేశాల నుంచి సేకరించిన 3,600 కరోనా RNA సీక్వెన్స్‌లను బృందం వినియోగించింది. చైనా లోపలి ప్రాంతాలతో పాటు మిగిలిన ప్రపంచానికి వ్యాప్తిచెందే సమయంలో కరోనా వైరస్ కొత్త రకాలుగా ఉద్భవించినట్టు తొలి పరిశీలనలో గుర్తించినట్టు తెలిపారు. కరోనా వైరస్‌ను మొత్తం O, A2, A2a, A3, B, B1 చాలా రకాలుగా విభజించవచ్చు. ప్రస్తుతం పురాతన మూలం ‘O’ రకంతో పాటు మొత్తం 11 రకాలు ఉన్నాయి. వుహాన్‌లో దీని వ్యాప్తికి అసలు మూలంగా చెబుతారని డైరెక్టర్, Majumder పేర్కొన్నారు. ఈ వైరస్ జీవించాలంటే కచ్చితంగా ఇతర జంతువులకు వ్యాపించాలి. సాధారణంగా ఏదైనా రకమైన ఉంటే.. వైరస్ వ్యాప్తి చెందకుండా డిసేబుల్ చేస్తుందని ఆయన తెలిపారు.

ఏది ఏమైనా కొన్ని రకాల వైరస్‌ను ఎనేబుల్ చేసి వ్యాధిని ఒకరి నుంచి మరొకరికి సోకేలా మార్పు చెందుతుంది. ఇలాంటి రకానికి చెందిన వైరస్‌ల్లో ప్రీక్వెన్సీ (ట్రాన్స్ మిషన్) పెరుగుతుంది. కొన్నిసార్లు అసలైన మూలాన్ని దాని వైరస్‌తో రిప్లేస్ చేస్తుంది. సాధారణంగా కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ (Covid) రోగి గొంతులోకి చేరుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా ఊపిరితిత్తులు, మల్టీపుల్స్, శ్వాసపరమైన సమస్యలను కలిగి ఉంటారు. A2a రకానికి చెందిన కంపోనెంట్ స్పైక్ ఉంటుందని తెలిపింది. A2a రకం నుంచి సులభంగా వైరస్ వ్యాపించగలదు. భారతదేశంలో ఒకవేళ RNA సీక్వెన్స్ శాంపిల్ వైరస్ బాధిత వ్యక్తులకు వాడినప్పటికీ వారిలో చాలా చిన్నమొత్తంలో (35)గా ఉంటుందని అధ్యయనంలో తేలగా A2a మొత్తం 47.5 శాతం శాంపిల్స్ ప్రదర్శించింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. A2a ప్రొటీన్ రకాన్ని కలిగి ఉన్న చాలామంది వ్యక్తుల్లో భారత్ బయట దేశాల్లో నుంచి ఎలాంటి ప్రయాణ చరిత్ర లేన్నట్టుగా రీసెర్చర్లు గుర్తించారు. భారతదేశంలో కరోనా A2a ఆధిపత్యం ప్రదర్శిస్తుందా కనిపెట్టాలంటే మాత్రం తప్పనిసరిగా మరిన్ని RNA శాంపిల్ సీక్వెన్స్ అవసరమని రీసెర్చర్లు వెల్లడించారు. కొవిడ్-19 వ్యాప్తిపై పోరాడేందుకు ఈ అధ్యయనం ఎంతో ముఖ్యమని అంటున్నారు. దీనిద్వారా కరోనా వ్యాక్సిన్లను అభివృద్ధి, కొన్ని ప్రాంతాల్లో ఇతర రకాలతో పాటు ఇదివరకే ఉన్న A2a రకాన్ని గుర్తించడానికి వీలు పడుతుందని చెబుతున్నారు.