Vivek Ramaswami: డొనాల్డ్ ట్రంప్ విజయం.. అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసునుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి

రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వంకోసం అయోవా కాకస్ లో తొలిపోరు జరిగింది. ఇందులో ట్రంప్ 51శాతం ఓట్లతో తొలివిజయం సాధించారు. అయితే, వివేక్ రామస్వామికి కేవలం 7.7శాతం ఓట్లే వచ్చాయి.

Donald Trump and Vivek Ramaswami

Donald Trump:  అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ముందు రిపబ్లికన్ పార్టీ అధినేత, భారతీయ అమెరికన్, ప్రముఖ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసు నుంచి తప్పుకున్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయోవా కాకస్ తొలిపోరులో విజయం సాధించాడు. ఆ తరువాత వివేక్ రామస్వామి ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ కు తన మద్దతు ఉంటుందని వివేక్ తెలిపారు. తాను ఎక్కడికీ వెళ్లడం లేదని, అయితే అందరితో కలిసి ఉంటూ ట్రంప్ కు తన మద్దతును అందిస్తానని వివేక్ అన్నారు.

Also Read : Chandrababu Quash Petition : ఏం జరగనుంది? సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ

రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వంకోసం అయోవా కాకస్ లో తొలిపోరు జరిగింది. ఇందులో ట్రంప్ 51శాతం ఓట్లతో తొలివిజయం సాధించారు. అయితే, వివేక్ రామస్వామికి కేవలం 7.7శాతం ఓట్లే వచ్చాయి. దీంతో రామస్వామి స్పందిస్తూ.. మా ప్రచారాన్ని నిలిపివేస్తున్నాం. తదుపరి అధ్యక్షుడిగా ఉండేందుకు నాకు మార్గం లేదని, అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు వివేక్ ప్రకటించారు. ఇదిలాఉంటే.. అయోవా నుంచి రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ నామినేషన్ గెలిచిన తరువాత డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. తాను అధ్యక్షుడిని అయితే ఏం చేస్తాననే విషయాన్ని వివరించాడు. సరిహద్దులను మూసేస్తాం.. ప్రస్తుతం మన దేశంపై దాడి జరుగుతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Also Read : KTR : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభ వార్తలపై స్పందించిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కీలక సూచన