KTR : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభ వార్తలపై స్పందించిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కీలక సూచన

గత ప్రభుత్వం ప్రారంభించిన వివిధ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఈ పరిశ్రమ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు.

KTR : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభ వార్తలపై స్పందించిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కీలక సూచన

BRS working president KTR

Updated On : January 16, 2024 / 11:53 AM IST

BRS MLA KTR : వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై వస్తున్న సంక్షోభ వార్తలకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ లను కేటీఆర్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. గత పది సంవత్సరాల్లో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందిందని అన్నారు. ఎంతో నైపుణ్యం కలిగిన పవర్లూమ్ నేతన్నలు, అభివృద్ధి చెందడమే కాకుండా తమ కార్యకలాపాలను విస్తరించారని కేటీఆర్ గుర్తు చేశారు.

Also Read : MLC Kavitha: ఈడీ నోటీసులకు స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. విచారణకు హాజరుకాలేనని వెల్లడి

గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సహకారమే ఇందుకు ప్రధాన కారణమని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పవర్లూమ్ వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలని కేటీఆర్ కోరారు. గత ప్రభుత్వం ప్రారంభించిన వివిధ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఈ పరిశ్రమ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు. ప్రభుత్వ సహకారం ఉంటే తమిళనాడులోఉన్న తిరుపూర్ వస్త్ర పరిశ్రమ తో సమానంగా పోటీ పడగలిగే అవకాశాలు ఈ రంగానికి ఉన్నాయని కేటీఆర్ అన్నారు. అయితే ఈ రంగానికి సంబంధించి గత 15 రోజులుగా వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఈ పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్తుందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా చూడాలని కేటీఆర్ కోరారు.