ఉత్తర కొరియా అధినేత కిమ్‌కు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ప్రత్యేక బహుమతి.. అదేంటో తెలుసా?

సెప్టెంబర్ లో రష్యా పర్యటనకు కిమ్ వెళ్లినప్పుడు పుతిన్ కారు ఆరస్ సెనేట్ లిమోసిన్ ను కిమ్ ఆసక్తిగా పరిశీలించినట్లు..

Kim and Putin

Vladimir Putin – Kim Jong Un : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఓ ప్రత్యేకమైన బహుమతిని అందించారు. గతేడాది సెప్టెంబర్ నెలలో మాస్కోలో కిమ్ జోంగ్ ఉన్, పుతిన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఉక్రెయిన్ పై యుద్ధం విషయంలో రష్యాకు ఉత్తర కొరియా సహకరిస్తున్నట్లు, రాకెట్లు, క్షిపణులు సహా పలు రకాల ఆయుధాలను సరఫరా చేస్తున్నట్లు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. అయితే, ఉత్తర కొరియా మాత్రం ఆ ప్రచారాన్ని ఖండించింది.

Also Read : Most Powerful Passports : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లివే.. టాప్ లిస్టులో ఫ్రాన్స్.. భారత్ ర్యాంకు ఎక్కడంటే?

సెప్టెంబర్ లో రష్యా పర్యటనకు కిమ్ వెళ్లినప్పుడు పుతిన్ కారు ఆరస్ సెనేట్ లిమోసిన్ ను కిమ్ ఆసక్తిగా పరిశీలించినట్లు.. దీంతో కిమ్ ను ఆ కారులో ఎక్కించుకొని పుతిన్ డ్రైవ్ చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా అలాంటి కారునే కిమ్ జోంగ్ ఉన్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ పంపించినట్లు తెలిసింది. వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకునేందుకు దీనిని ఇచ్చినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

Also Read : International UPI Payments : విదేశీ ప్రయాణాల్లో యూపీఐ పేమెంట్లను ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

ఫిబ్రవరి 18న కిమ్ తరపున ఆయన సోదరి యో జోంగ్ దీనిని అందుకున్నట్లు, ఈ సందర్భంగా కిమ్ యో జోంగ్ రష్యాకు కృతజ్ఞతలు తెలిపినట్లు సమాచారం. అయితే, వీటిని ఉత్తర కొరియాకు ఎగుమతి చేయడంపై ఐరాస నిషేధం విధించింది. తాజాగా పుతిన్ కారు పంపడం సైతం ఆంక్షల ఉల్లంఘన కిందకే వస్తుందని నిపుణులు అంటున్నారు.