Most Powerful Passports : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లివే.. టాప్ లిస్టులో ఫ్రాన్స్.. భారత్ ర్యాంకు ఎక్కడంటే?

Most Powerful Passports Ranking : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో ఫ్రాన్స్ అగ్రస్థానంలో నిలవగా.. భారత్ ఒక స్థానానికి దిగజారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Most Powerful Passports : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లివే.. టాప్ లిస్టులో ఫ్రాన్స్.. భారత్ ర్యాంకు ఎక్కడంటే?

India slips in world's most powerful passports ranking, France tops list

Most Powerful Passports Ranking : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాను హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ విడుదల చేసింది. 2024 ఏడాదికి సంబంధించిన ఈ జాబితాలో ఫ్రాన్స్ టాప్ ర్యాంకింగ్స్‌లో నిలిచింది. భారత్ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్‌‌లో ఒక స్థానానికి దిగజారింది. అంటే.. గతేడాదిలో భారత్ 84వ ర్యాంకు నుంచి 85వ ర్యాంకుకు పడిపోయింది. పాస్‌పోర్టుల ర్యాంకింగ్‌లో భారత్ క్షీణత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గత ఏడాదిలో భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు వీసా లేకుండా 60 దేశాలకు స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు. కానీ, ఈ ఏడాదిలో ఆ సంఖ్య 62కి పెరిగింది.

Read Also : World’s 3rd Biggest Economy : జపాన్‌ను అధిగమించి ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జర్మనీ.. అతి త్వరలోనే భారత్ కూడా..!

ఇతర అగ్రశ్రేణి దేశాలివే.. 106వ ర్యాంకులో పాకిస్థాన్ :
హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచ దేశాల పాస్‌పోర్ట్‌ల బలం ఆధారంగా ఆయా దేశాలను ర్యాంకింగ్ అందిస్తుంది. ఈ జాబితా ప్రకారం.. 2024లో 194 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌ను మంజూరు చేసిన పాస్‌పోర్ట్‌తో ఫ్రాన్స్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ కూడా ఫ్రాన్స్‌తో పాటు అగ్రశ్రేణి దేశాలలో ఉన్నాయి. ఇదిలా ఉంటే, గత ఏడాది మాదిరిగానే పాకిస్థాన్ 106వ ర్యాంకులో కొనసాగుతోంది.

102 ర్యాంకుకు దిగజారిన బంగ్లాదేశ్ :
అదేవిధంగా, బంగ్లాదేశ్ 101వ ర్యాంకు నుంచి 102వ ర్యాంకుకు దిగజారింది. భారత్ పక్కదేశాలైన మాల్దీవులు బలమైన పాస్‌పోర్ట్‌ను కలిగి ఉంది. ఈ జాబితాలో మాల్దీవులు తన స్థానాన్ని 58వ ర్యాంకుతో కొనసాగిస్తోంది. మాల్దీవుల పాస్‌పోర్టు కలిగిన వారు 96 దేశాలకు వీసా-రహిత ప్రయాణాన్ని (వీసా-ప్రీ ట్రావెల్) పొందుతున్నారు.

ఇరాన్, మలేషియా, థాయ్‌లాండ్‌లు కూడా భారతీయ పర్యాటకులకు వీసా-ప్రీ ఎంట్రీ ఆఫర్ కల్పిస్తున్నట్లు ఇటీవల ప్రకటించాయి. ఆ తర్వాత కూడా భారత్ హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా 199 విభిన్న పాస్‌పోర్ట్‌లు, 227 ప్రయాణ గమ్యస్థానాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) ప్రత్యేక డేటా ఆధారంగా గత 19 సంవత్సరాల డేటా నుంచి హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్‌లను అందిస్తోంది.

ఈ ర్యాంకింగ్ జాబితా నెలవారీగా అప్‌డేట్ చేస్తుంటుంది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ నుంచి డేటా గత రెండు దశాబ్దాలుగా గ్లోబల్ మొబిలిటీలో గణనీయమైన మార్పులను సూచిస్తుంది. 2006లో ప్రయాణికులు సగటున 58 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. ఈ ఏడాదిలో ఆ సంఖ్య దాదాపు రెట్టింపు అయి 111 దేశాలకు చేరుకుంది.

ప్రపంచంలోని టాప్ 10 అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ కలిగిన దేశాలివే :

  •  ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్, స్పెయిన్ సింగపూర్ (194 )
  • స్వీడన్, దక్షిణ కొరియా, ఫిన్లాండ్ (193)
  • నెదర్లాండ్స్, డెన్మార్క్, ఆస్ట్రియా, ఐర్లాండ్ (192)
  • యునైటెడ్ కింగ్‌డమ్, లక్సెంబర్గ్, పోర్చుగల్, బెల్జియం, నార్వే (191)
  • స్విట్జర్లాండ్, మాల్టా, గ్రీస్, (190)
  • న్యూజిలాండ్, పోలాండ్, చెక్ రిపబ్లిక్ (189)
  • యునైటెడ్ స్టేట్స్, హంగరీ, కెనడా (188)
  • లిథువేనియా, ఎస్టోనియా (187)
  • స్లోవేనియా, స్లోవేకియా, లాట్వియా (186 )
  •  ఐస్లాండ్ దేశాలు (185)

Read Also : Ather 450 EV Scooter : అన్ని రూ. 10 నాణేలు చెల్లించి.. లక్షల ఖరీదైన ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ కొనుగోలు చేసిన కస్టమర్.. ఎక్కడంటే?