డ్రాగన్ వ్యూహం ఏంటి?: ‘Iron Man’ సూట్లతో LACలో మోహరించిన చైనా సైన్యం

China Deploys ‘Iron Man’ Soldiers Near LAC : భారత్‌, చైనాల మధ్య సరిహద్దు వివాదం మధ్య డ్రాగన్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. నైరుతి చైనా టిబెట్ అటానమస్ రీజియన్‌లోని Ngariలో చైనా బలగాలు మోహరించాయి.

ఐరన్ మ్యాన్ సూట్లు ధరించి తమ సరిహద్దు ఎల్ఏసీ దగ్గర డ్రాగన్ సైన్యం మోహరించింది. సూపర్ హీరోల మాదిరిగా చైనా సైనికులు ‘exoskeleton’ ఐరన్ సూట్లను ధరించి ఉన్నారు.

Starship Troopers Iron Man మూవీల్లోగా చైనా సైన్యం ఐరన్ మ్యాన్ సూట్లలో మోహరించాయి. సైనికుల కోసం శక్తివంతమైన కవచం లాంటి ‘exoskeleton’ ఐరన్ సూట్లను ఉత్పత్తి చేసే రేసులో రష్యా, అమెరికాతో చైనా పోటీపడుతోంది.

అందులో భాగంగానే చైనా తమ సైనికులకు ఐరన్ సూట్లను ఉత్పత్తి చేసింది. ఈ ఎక్సోస్కెలిటన్ సూట్లు మొబైల్ మిషన్లగా పనిచేస్తాయి. శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్లు, న్యూమాటిక్స్, లివర్స్, హైడ్రాలిక్స్ తో సులభంగా కదిలేలా సాంకేతికతతో రూపొందించారు.

కానీ చైనా దళాలు నాన్-పవర్డ్ సూట్లను ఉపయోగిస్తున్నాయి.అయినప్పటికీ ఫిరంగిని రీలోడ్ చేయగల సామర్థ్యం ఉందని ఓ నివేదిక వెల్లడించింది. ఈ ఎక్సోస్కెలిటన్ సూట్లు నడుము లేదా కాలి గాయాల ప్రమాదాన్ని నివారించేలా రూపొందించారు.
అలాగే అధిక బరువైన సామాగ్రిని కూడా ఈజీగా సైనికులు మోసకెళ్లే విధంగా ఉన్నాయి. ఈ సూట్లు సరిహద్దు ప్రాంతాల్లోని సైనిక దళాలకు మరింత ప్రయోజనాన్ని అందిస్తాయని చైనా నిపుణులు భావిస్తున్నారు.

చైనీస్ సూట్లు ఎలా పని చేస్తాయంటే? :
భారతదేశానికి వాస్తవ సరిహద్దు అయిన వాస్తవ నియంత్రణ రేఖ (LAC)వెంట ఫార్వర్డ్ పోస్టులలో చైనా తమ సైనిక బలగాలను మోహరించింది. తూర్పు లడఖ్ ప్రాంతంలోని Ngariలో (సుమారు 200 కిలోమీటర్లు) దూరంలో ఉంది. ఇదే ప్రాంతంలో భారత్-చైనాల మధ్య ప్రతిష్టంభన ప్రారంభమైంది.

చైనా తన దళాలను కఠినమైన శీతాకాలంలో విపత్కర పరిస్థితులను తట్టుకునేందుకు వీలుగా ఈ తరహా ఐరన్ సూట్లను ఉత్పత్తి చేస్తోంది. ప్రతి సైనికుడు తాము ధరించిన ఈ ఐరన్ సూట్లలో 20 కిలోగ్రాముల సామాగ్రిని తమ బ్యాక్‌ప్యాక్‌లలో తీసుకెళ్లగలరు. బ్యాక్‌ప్యాక్‌ల బరువు సైనికుల కాళ్లమీద పడుతుంది. అందుకు బదులుగా ఎక్సోస్కెలిటన్ సూట్ల ఫ్రేమ్‌లకు వాటిని మార్చినట్టు పీఎల్ఏ సైనికుడు ఒకరు వెల్లడించారు.

చూసేందుకు చాలా తేలికగా కనిపించినప్పటికీ.. ఈ ఐరన్ సూట్లు సైనికుల శక్తిని ఆదా చేస్తాయి. ఎత్తైనా భూభాగాల్లోకి కదిలే సమయంలో అధిక స్థాయిలో శక్తి ఖర్చువుతుంది. మోకాలి కీళ్లపై తీవ్ర ఒత్తిడిపడుతుంది. శరీరం అలసిపోవచ్చు.

ఇలాంటి పరిస్థితుల్లో సునాయసంగా సైన్యం ముందుకు కదిలేందుకు వీలుగా ఈ సూట్లను డిజైన్ చేశారు.

ఈ తరహా ఐరన్ సూట్లను చైనా టెస్టింగ్ చేస్తుందంటూ ముందుగా సెప్టెంబరులో ఆ తరువాత నవంబర్ నెలలో కథనాలు వచ్చాయి.

వైద్య తరలింపు వ్యాయామంలో భాగంగా గాయపడిన సైనికులను స్ట్రెచర్‌పై తీసుకెళ్లడానికి పిఎల్‌ఎ సైనికులు ఈ ఐరస్ సూట్లనే ధరించి ఉన్నట్టు రాష్ట్ర-మీడియాలో ఒక ఫుటేజ్ రిలీజ్ అయింది. మరోవైపు వివాదాస్పద ప్రాంతమైన ఎల్ఏసీ సమీపంలోనే చైనా తమ సైనికులను ఎందుకు మోహరించింది?  చైనా బలగాలు ఐరన్ సూట్లతో మోహరించడానికి వెనుక అసలు వ్యూహం ఏంటి?.. నక్కజిత్తులమారి చైనా భారత్ తో మరోమారు కయ్యానికి కాలు దువ్వబోతుందా? లేదా కవ్వించే ప్రయత్నమా అనేది తెలియాల్సి ఉంది.