Amazing viral Video : ఫోన్‌ను ఎత్తుకెళ్లిన చిలుక..వీడియోఎంత బాగా షూట్ చేసిందో..!!

ఓ రామ చిలుక గాల్లో ఎగురుతు ఫోన్ తో తీసిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో ఏమాత్రం షేక్ అవ్వటంగానీ..బ్లర్ అవ్వటం గానీ లేదు..చాలా క్లారిటీగా చిలుకమ్మ ఎంత బాగా తీసిందో వీడియో ..

Parrot takes the phone on a fantastic trip : సెల్ ఫోన్లతో వీడియోలు తీయటం అవి వైరల్ కావటం చూస్తున్నాం.కానీ ఓ పక్షి వీడియో తీస్తే ఎలా ఉంటుంది.అదికూడా గాల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఫోన్‌తో వీడియో షూట్ చేస్తే ఎలా ఉంట‌ుందీ. ఏంటీ పక్షులు వీడియో తీయటమేంటీ? అదికూడా ఫోన్ లో గాల్లో ఎగురుతూ..ఇది ఇలా ఇంత అదర్భుతంగా ఉంటుంది. మన వీడియో తీస్తే వీడియో షేక్ అవుతుందేమో కానీ ఓ రామచిలుక ఫోన్ తో తీసిన వీడియో మాత్రం షేక్ అవ్వలేదు సరకదా ఫుల్ క్లారిటీగా ఉంది. పైగా వీడియో తీసే రామచిలుక కూడా ఈ వీడియోలో కనిపించటం మరో విశేషం..మరి ఆ రామచిలుక వీడియో ట్రెండింగ్ ఏంటో లుసుకుందామా..తరువాత చూసేద్దాం.

ఓ వ్యక్తి తన ఫోన్ లో ఏవో చూసుకుంటున్నాడు ఇంటి బయట నిలబడి. సడెన్ గా ఓ రామచిలుక ఎక్కడనుంచి వచ్చిందో గానీ ఎలా ఎత్తుకుపోయిందో అతని చేతిలోంచి ఫోన్‌ ఎత్తుకుపోయింది. దాంతో అతని దిమ్మ తిరిగిపోయింది. కానీ క్షణాల్లో ఆ రామచిలుక అరుచుకుంటూ ఫోన్ తో సహా ఎగిరిపోయింది. అలా ఫోన్ దొంగిలించి ఎగురుకుంటూ వెళ్తుండ‌గా.. ఆ ఫోన్ కెమెరా ఆన్ అయింది. దీంతో వీడియో రికార్డు అయింది.

ఓ వ్య‌క్తి ఫోన్‌ను లాక్కెళ్లిన రామ‌చిలుక దాన్ని కాలి గోళ్ల‌తో ఫోన్‌ను ప‌ట్టుకుంది. అదే స‌మ‌యంలో.. ఫోన్ కెమెరా ఆన్ అయి రికార్డ‌వ‌డం స్టార్ట్ అయింది. ఇక అది ఎగురుకుంటూ కొంచెం దూరం రోడ్డు గుండా మళ్లీ ఇళ్ల మీద నుంచి అలా వెళ్తూ ఉంది. అలా వెళ్లీ వెళ్లీ..అటు తిరిగి ఇటు తిరిగి చివ‌ర‌కు ఓ కారు మీద ఆగింది. అప్పుడు గానీ ఆ ఫోన్ రికార్డింగ్ ఆగ‌లేదు.

అలా చిలుక ట్రిప్‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. డ్రోన్ తో తీసిన వీడియోకు కూడా ఇంత క్లారిటీ ఉండదేమో అన్నట్లుగా భలే తీసింది రామచిలుక వీడియోని.సూప‌ర్బ్‌.. ప‌క్షుల పైన ఎగురుతూ వెళ్తుంటే.. కింద వ్యూ అలా ఉంటుందా? అని నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. కొంతమంది ఈ వీడియోను పర్యావరణ అనుకూలమైన డ్రోన్ అని అంటున్నారు.

ఈ వీడియోలో ఫోన్ పట్టుకుని ఎగిరే రామచిలుక కూడా కనిపిస్తుంది నీడలాగా..అలాకొన్ని సార్లు చిలుక రెక్కలు కనిపించాయి. ఈ వీడియో ఎక్కడా బ్లర్ అవ్వటం గానీ షేక్ అవ్వటం గానీ లేకపోవటంతో చిలుక వీడియోను ఎంతబాగా తీసిందో నని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. మొత్తానికి మరి ఆ ఫోన్ ఆ ఫోన్ యాజమానికి దొరికిందో లేదో తెలీదు గానీ ట్విట్టర్‌లో యూజర్ @fred035schultz ద్వారా.. 1.49 నిమిషాల ఈ వీడియో క్లిప్‌ లక్షల వ్యూస్ వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి.

— Fred Schultz (@fred035schultz) August 24, 2021