Viral Video : టొరంటోలో తుఫాన్ బీభత్సం.. రాకాసి గాలులకు కొట్టుకుపోయిన ట్రాంపోలిన్

Viral Video : కెనడాలోని టొరంటోలో పెనుతుఫాను బీభత్సం సృష్టిస్తోంది. కొద్దిరోజులుగా రాకాసి గాలులతో తుఫాన్ విరుచుకుపడుతోంది. తుఫాన్ గాలుల తీవ్రతకు కార్ల మధ్య ఓ ట్రాంపోలిన్ గాల్లోకి ఎగిరి కొట్టుకుపోయింది.

Viral Video : టొరంటోలో తుఫాన్ బీభత్సం.. రాకాసి గాలులకు కొట్టుకుపోయిన ట్రాంపోలిన్

Belgium Becomes First Country To Introduce Monkeypox Quarantine, What We Know About The Virus So Far (3)

Updated On : May 23, 2022 / 2:10 PM IST

Viral Video : కెనడాలోని టొరంటోలో పెనుతుఫాను బీభత్సం సృష్టిస్తోంది. కొద్దిరోజులుగా రాకాసి గాలులతో తుఫాన్ విరుచుకుపడుతోంది. తుఫాన్ గాలుల తీవ్రతకు కార్ల మధ్య ఓ ట్రాంపోలిన్ గాల్లోకి ఎగిరి కొట్టుకుపోయింది. బలమైన గాలులకు ట్రాంపోలిన్ రోడ్లపైకి దూసుకెళ్లింది. కార్ల మధ్యలో నుంచి ట్రాంపోలిన్ గాల్లో ఎగురుతూ పోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 38.2 మిలియన్ల జనాభా కలిగిన కెనడాలో దాదాపు 40శాతం అంటారియో నివాసంగా ఉంది. ఇప్పటికే తుఫాన్ హెచ్చరికలు జారీ కాగా.. కెనడా, కొన్ని ప్రాంతాల్లో గంటకు 132 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు పర్యావరణ శాఖ తెలిపింది.

Belgium Becomes First Country To Introduce Monkeypox Quarantine, What We Know About The Virus So Far (2)

Belgium Becomes First Country To Introduce Monkeypox Quarantine, What We Know About The Virus So Far 

తూర్పు కెనడాలో తుఫాన్ ధాటికి మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి పెరిగిందని అధికారులు వెల్లడించారు. ఒంటారియో ప్రావిన్స్‌లో చెట్ల కొమ్మలు నేలకూలడంతో శనివారం ఏడుగురు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. ఫెడరల్ రాజధాని ఒట్టావాలోని క్యూబెక్ శివారు ప్రాంతమైన గాటినో సమీపంలో ఒట్టావా నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో ఓ మహిళ మృతిచెందింది. బలమైన గాలులు గంటకు 140 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగంతో వీస్తున్నాయి.

తూర్పు కెనడాను తుఫాన్ తీవ్రంగా దెబ్బతీసింది. డెరెకో అని పిలిచే ఈ తుఫాను దాదాపు 1000 కిలోమీటర్లు పొడవు ఉందని పర్యావరణ కెనడా సీనియర్ క్లైమాటాలజిస్ట్ డేవిడ్ ఫిలిప్స్ ఆదివారం స్థానిక స్టేషన్ CFRAకి తెలిపారు. శనివారం రాత్రి దాదాపు 9లక్షల గృహాలకు విద్యుత్త్ సరఫరా నిలిచిపోయింది. ఆదివారం సాయంత్రం నాటికి వందల వేల గృహాలు అంధకారంలో ఉండిపోయాయి. రోడ్లన్నీ చెట్లకొమ్మలు, శిధిలాలతో నిండిపోయాయి. ఇదంతా క్లీన్ చేయడానికి చాలా రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు.

Read Also : Indian Student: కెనడాలో ఇండియన్ స్టూడెంట్ హత్య