Photojournalist Death: మాకు సంబంధం లేదు.. భారత ఫొటో జర్నలిస్టు మృతిపై తాలిబన్ల సంతాపం..!

అఫ్ఘానిస్తాన్‌లో ఆ దేశ బలగాలకు, తాలిబన్లకు మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత్‌కు చెందిన ప్రముఖ ఫొటో జర్నలిస్ట్, పులిట్జర్ అవార్డు గ్రహీత డానిష్ సిద్దిఖీ మృతిపట్ల తాలిబన్లు సంతాపం తెలిపారు.

Taliban denies role in photojournalist Danish Siddiqui death : అఫ్ఘానిస్తాన్‌లో ఆ దేశ బలగాలకు, తాలిబన్లకు మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత్‌కు చెందిన ప్రముఖ ఫొటో జర్నలిస్ట్, పులిట్జర్ అవార్డు గ్రహీత డానిష్ సిద్దిఖీ మృతిపట్ల తాలిబన్లు సంతాపం తెలిపారు. జర్నలిస్టు సిద్దిఖీ మృతితో తమకు ఎలాంటి సంబంధం లేదని తాలిబన్ల ప్రతినిధి Zabiullah Mujahid ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వార్ జోన్‌లోకి ఏ జర్నలిస్టు ప్రవేశించినా ముందుగా తమకు సమాచారం అందించాలని అన్నారు.

అప్పుడు వారికోసం ప్రత్యేక రక్షణ కల్పించగలమని చెప్పినట్టు ఓ నివేదిక తెలిపింది. తమకు సమాచారం ఇవ్వకుండా ఆ జర్నలిస్టు వార్ జోన్ లోకి ప్రవేశించి ప్రాణాలు కోల్పోయినందుకు చింతిస్తున్నామని ముజాహిద్ తెలిపారు. ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. కాందహార్ లోని స్పిన్ బొల్డాక్ ప్రాంతంలో పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాన్ని తాలిబన్లు ఇటీవల తమ అధీనంలోకి తీసుకున్నారు.

అప్పటినుంచి తాలిబన్, అప్ఘానిస్తాన్ బలగాల మధ్య ఘర్షణలకు దారితీసింది. రాయిటర్స్ సంస్థలో పనిచేస్తున్న 38ఏళ్ల డానిశ్ సిద్ధిఖీ యుద్ధం జరిగే ప్రాంతాన్ని కవర్ చేసేందుకు వెళ్లారు. ఈ ఘర్షణల్లో డానిశ్ మృతి చెందారు. భారత్ అఫ్గాన్ రాయబారి ఫారిద్ మముంజే ట్విటర్ వేదికగా ధ్రువీకరించారు.

రిపోర్టింగ్ కోసం అఫ్గాన్ స్పెషల్ ఫోర్సెస్‌తో కలసి సిద్దిఖీ కాందహార్‌కు వెళ్లారు. సిద్దిఖీ మృతిపై భారత్‌లో అప్ఘానిస్తాన్ అంబాసిడర్ ఫరిద్ మముంజే సంతాపం వ్యక్తం చేశారు. సిద్దిఖీ మృతి తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన ట్వీట్ చేశారు. సిద్దిఖీ టెలివిజన్ న్యూస్ కరస్పాండెంట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఫొటో జర్నలిజంలో స్ధిరపడ్డారు. 2017 నుంచి ప్రముఖ అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్‌లో సిద్దిఖీ వర్క్ చేస్తున్నారు. సిద్దిఖీ మృతిని రాయిటర్స్ ధ్రువీకరించింది.

ట్రెండింగ్ వార్తలు