భారత్ – చైనా మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న అమెరికా

  • Publish Date - September 5, 2020 / 11:53 AM IST

Indian Americans would be voting for me : భారత్‌-చైనాల మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధమని సంకేతాలిచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మీడియాతో మాట్లాడిన ఆయన ఇరుదేశాల మధ్య సరిహద్దు వివాదంపై స్పందించారు. ఇరుదేశాల బోర్డర్‌లో పరిస్థితి చాలాచాలా దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ వివాదంలో ఇరుదేశాలకు తాము చేయగలిగిన సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.




అదే సమయంలో ప్రధాని నరేంద్రమోదీ పైనా ప్రశంసలు గుప్పించారు ట్రంప్. ప్రదాని మోడీ తన స్నేహితుడని, మంచిగా పని చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. గత సెప్టెంబర్ నెలలో జరిగిన ‘Howdy Mody’ కార్యక్రమాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. భారతదేశ ప్రజలు గొప్ప నాయకుడిని పొందారని, మోడీ గొప్ప వ్యక్తన్నారు.
https://10tv.in/there-is-a-small-but-real-chance-an-asteroid-will-hit-earth-the-day-before-the-us-election/
చైనా చాలా దూకుడుగా వ్యవహరిస్తోందని, ఇరువర్గాలతో చర్చలు జరుపుతున్నామన్నారు. చాలా మంది అంచనాల కంటే బలంగా, వేగంగా ముందుకెళుతోందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. లద్దాఖ్ లో జరిగిన ఘర్షణల్లో, గల్వాన్ ఘటన సమయంలో సయోధ్యకు ప్రయత్నిస్తామని గతంలో అమెరికా చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఆ దేశ ప్రతిపాదనను ఇరు దేశాలు వ్యతిరేకించాయి. దౌత్య మార్గాల ద్వారా వివాదాలను పరిష్కరించుకుంటామన్నారు.




అమెరికాలో త్వరలో జరిగే ఎన్నికల అంశాన్ని కూడా ప్రస్తావించారు ట్రంప్. నవంబర్ 03న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో భారత అమెరికన్లు తనకు ఓటు వేస్తారని అనుకుంటున్నట్లు చెప్పారు. కింబర్లీ, డోనాల్డ్ జె ట్రంప్, ఇవాంకలు యంగ్ పీపుల్స్ అని, భారతదేశంతో వారికి మంచి సంబంధాలున్నాయన్నారు. అంతేగాకుండా..భారతదేశం నుంచి గొప్ప మద్దతుందన్నారు. డెమోక్రాట్లకు ఓటువేసే భారతీయ అమెరికన్లు రిపబ్లికన్ పార్టీకి మారుతున్నారని అధ్యయనంలో తేలింది.

ట్రెండింగ్ వార్తలు