‘మౌస్ జిగ్లింగ్‌’కు పాల్పడుతున్న ఉద్యోగులను తొలగించిన దిగ్గజ సంస్థ.. ‘మౌస్ జిగ్లింగ్‌’ అంటే ఏంటో తెలుసా?

Mouse Jiggling: ఇంట్లో వేరే పనులు చేస్తున్న సమయంలోనూ కంప్యూటర్ స్లీప్ మోడ్ లోకి వెళ్లకుండా మౌస్ జిగ్లర్లు వాడుతూ కంపెనీని బోల్తా కొట్టించారు ఉద్యోగులు.

‘మౌస్ జిగ్లింగ్‌’కు పాల్పడుతున్న ఉద్యోగులను తొలగించిన దిగ్గజ సంస్థ.. ‘మౌస్ జిగ్లింగ్‌’ అంటే ఏంటో తెలుసా?

mouse jigglers

మౌస్ జిగ్లింగ్‌కు పాల్పడుతున్న ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంది అమెరికాలోని ప్రముఖ వెల్స్ ఫార్గో బ్యాంక్. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలను అందిస్తున్న అమెరికాలోని దిగ్గజ బ్యాంకుల్లో ఒకటి వెల్స్ ఫార్గో.

ఇంటి నుంచి పనిచేసే కొందరు ఉద్యోగులు మౌస్ జిగ్లింగ్‌కు పాల్పడ్డారని ఆ బ్యాంకు గుర్తించింది. ఉద్యోగులు ఇటువంటి అనైతిక ప్రవర్తనను కనబర్చితే ఉపేక్షించబోమని ఆ బ్యాంకు తెలిపింది.

మౌస్ జిగ్లర్లు అంటే అవి సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లు. చిన్న పరికరంతో కూడి ఉంటుంది. సాధారణంగా మనం కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు కీ బోర్డ్ లేదా మౌస్ ను కదిలిస్తున్నంత సేపు కంప్యూటర్ స్లీప్ మోడ్ లోకి వెళ్లదు. కంప్యూటర్ స్లీప్ మోడ్ లోకి వెళ్తే మనం కంప్యూటర్ ముందు లేమని కంపెనీకి తెలిసిపోతుంది.

కంపెనీని బోల్తా కొట్టించడానికి, కొందరు ఉద్యోగులు మౌస్ జిగ్లర్లను వాడి కంప్యూటర్ స్లీప్ మోడ్ లోకి వెళ్లకుండా చేస్తున్నారు. అది స్క్రీన్‌సేవర్‌ని యాక్టివేట్ చేయకుండా నిరోధిస్తోంది. దీంతో తమ ఉద్యోగి కంప్యూటర్ ముందే ఉండి పనిచేస్తున్నాడని కంపెనీ భావిస్తుంది.

అయితే, ఆ ఉద్యోగి కంప్యూటర్ ముందు ఉండకుండా, ఇతర పని చేసుకుంటూ ఉంటాడు. కంప్యూటర్ ముందు ఉద్యోగి లేకపోయినా.. పనిచేస్తున్నట్లు కంపెనీ భావించాలని వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు అనైతికంగా మౌస్ జిగ్లర్లను వాడుతున్నారు. దీంతో కంప్యూటర్ ముందు కూర్చొని అధిక సమయం తమ ఉద్యోగి పనిచేస్తున్నట్లు కంపెనీ భావిస్తుందని ఉద్యోగులు అనుకుంటారు.

Also Read: తమిళనాడు అటవీ అధికారుల అతితెలివి.. చిరుత పులిని ఏం చేశారంటే..

సాధారణంగా వర్క్ ఫ్రం హోం చేస్తున్న సమయంలో వాష్ రూమ్ వెళ్లినా, ఇంట్లో ఇతర పనులు చేసుకుంటున్నా కంప్యూటర్ స్లీప్ మోడ్ లోకి వెళ్తుంది. ఆయా పనులు చేస్తున్న సమయంలోనూ కంప్యూటర్ స్లీప్ మోడ్ లోకి వెళ్లకుండా మౌస్ జిగ్లర్లు వాడుతూ కంపెనీని మభ్యపెట్టారు ఉద్యోగులు. ఈ నేపథ్యంలోనే వెల్స్ ఫార్గో బ్యాంక్ వారిని ఉద్యోగం నుంచి తొలగించింది.