పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేసేముందు లోకేశ్, టీడీపీ సభ్యుల ఉత్సాహం చూశారా.. వీడియో వైరల్

: ఏపీ అసెంబ్లీలో సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.

పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేసేముందు లోకేశ్, టీడీపీ సభ్యుల ఉత్సాహం చూశారా.. వీడియో వైరల్

Pawan Kalyan Oath taking

Updated On : June 21, 2024 / 10:41 AM IST

AP Assembly Session 2024 Pawan Kalyan takes oath : ఏపీ అసెంబ్లీలో సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా.. ఆ తరువాత ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కల్యాణ్ ను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించగానే.. టీడీపీ, జనసేన సభ్యులు లేచినిలబడి చప్పట్లతో స్వాగతం పలికారు.

Also Read : అసెంబ్లీకి వచ్చేముందు చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు ఏం చేశారో తెలుసా?

పవన్ ప్రమాణ స్వీకారం చేసేందుకు వెళ్తుండగా.. మంత్రి నారా లోకేశ్ తన స్థానంలో లేచినిలబడి తన ఎదురుగా ఉన్న బల్లపైకొట్టి శబ్దం చేస్తూ తన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. అనంతరం పవన్ చే ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రొటెం స్పీకర్ స్థానం వద్దకు వెళ్లి పవన్ కల్యాణ్ నమస్కారం చేశారు. అంతకుముందు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనూ టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు లేచినిలబడి చప్పట్లతో స్వాగతం పలికారు.

 

Also Read : AP Assembly Session 2024 : ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. చంద్రబాబు, పవన్, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ప్రత్యక్ష ప్రసారం..