కొవిడ్ కన్నా డేంజరస్, 48గంటల్లో మనిషిని చంపేస్తుంది..! ప్రపంచాన్ని కలవరపెడుతున్న మరో భయంకరమైన వ్యాధి

ఈ వ్యాధి కేసులు 30ఏళ్లు పైబడిన వారిలో అత్యధికంగా నమోదవుతుండగా.. 50ఏళ్లు పైబడిన వారికి ప్రమాదకరంగా మారుతోంది.

కొవిడ్ కన్నా డేంజరస్, 48గంటల్లో మనిషిని చంపేస్తుంది..! ప్రపంచాన్ని కలవరపెడుతున్న మరో భయంకరమైన వ్యాధి

Flesh Eating Bacteria : కొవిడ్ మహమ్మారి పీడ విరగడైందని ఊపిరి పీల్చుకుంటున్న వేళ మరో డేంజరస్ వ్యాధి ప్రపంచాన్ని కలవరానికి గురి చేస్తోంది. జపాన్ లో వెలుగుచూసిన స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనే బ్యాక్టీరియా తీవ్ర భయాందోళ కలిగిస్తోంది. ఈ వైరస్ గురించి తెలుసుకుంటే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. అంత డేంజరస్ గా, అత్యంత భయంకరంగా వ్యాపిస్తూ జనాల ప్రాణం తీస్తోంది. మనిషిని తినే ఈ బ్యాక్టీరియా సోకిన వ్యక్తి కేవలం 48 గంటల్లోనే చనిపోతుండటం తెలిసి ప్రపంచమే షాక్ కు గురవుతోంది. రెండు రోజుల్లో మనిషిని చంపేసే ఈ భయంకరమైన బ్యాక్టీరియా జపాన్ లోని టోక్యోలో వేగంగా విస్తరిస్తోంది. స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ బ్యాక్టీరియా కరోనా కంటే డేంజరస్.

ఇప్పటికే 977 కేసులు నమోదు..
మనిషి మాంసాన్ని తిని బతికే ఈ బ్యాక్టీరియా కేసులు జపాన్ లో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జపాన్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ ఫెక్షియస్ డిసీజస్ ప్రకారం జూన్ 2 నాటికి 977 కేసులు నమోయ్యాయి. అయితే, బ్యాక్టీరియా కేసులు గతేడాది మొత్తం 941 నమోదవగా, ఈ ఏడాది మాత్రం ఇప్పటికే 977 కేసులు నమోదు కావటం మరింత భయాందోళనకు గురి చేసే అంశం. ఈ ఏడాది ఫిబ్రవరి వరకే టోక్యోలో 145 కేసులు నమోదయ్యాయి.

వ్యాధి లక్షణాలు ఇవే? 50ఏళ్లు పైబడిన వారికి ప్రాణాంతకం..
ఈ వైరస్ సోకిన మనిషికి సాధారణంగా గొంతు నొప్పి, వాపు వంటి తేలికపాటి అనారోగ్య లక్షణాలు మొదలవుతాయి. క్రమంగా శరీరంలోని అవయవాల నొప్పి, వాపు, జ్వరం, లో బీపీ, శరీర కణజాలాన్ని చంపేసే నెక్రోసిస్ వంటి లక్షణాలు తీవ్రం అవుతాయి. ఈ వ్యాధి విజృంభించి చివరికి అవయవాలు పూర్తిగా దెబ్బతిని మరణం సంభవిస్తుంది. ఈ వ్యాధి కేసులు 30ఏళ్లు పైబడిన వారిలో అత్యధికంగా నమోదవుతుండగా.. 50ఏళ్లు పైబడిన వారికి ప్రమాదకరంగా మారుతోంది. ఈ బ్యాక్టీరియాతో చాలా మరణాలు 48 గంటల్లోనే జరుగుతున్నట్లు జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వ్యాధి సోకిన రోగికి ఉదయం పాదంలో వాపు వస్తే అది మధ్యాహ్నానికి మోకాలి వరకు వ్యాపిస్తుంది. ఆ తర్వాత 48 గంటల్లోనే ఆ వ్యక్తి చనిపోవచ్చని వైద్య నిపుణులు వెల్లడించారు. ఈ బ్యాక్టీరియా వ్యాధి మరణాల రేటు 30శాతం ఉండటం ప్రమాదకరం అని హెచ్చరించారు.

చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి..
ఈ డేంజరస్ బ్యాక్టీరియా రోగిలోని పేగుల్లో జీవిస్తుందని, మలం ద్వారా చేతులను కలుషితం చేస్తుందని నిపుణులు తెలిపారు. అందుకే చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, ఒంటిపై గాయాలున్న వారు వెంటనే చికిత్స చేయించుకోవాలని సూచించారు. ఈ డేంజరస్ బ్యాక్టీరియా వ్యాపి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఈ ఏడాది జపాన్ లో కేసుల సంఖ్య 2వేల 500కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే మరణాల రేటు కూడా ఊహించని విధంగా ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు 2022లో ఈ వ్యాధి కేసులో 5 యూరప్ దేశాల్లో గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అందులోనూ కోవిడ్ ఆంక్షల ముగింపు తర్వాతే ఈ కేసులు పెరిగాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.

Also Read : గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చే అద్భుతమైన 5 ఆహారాలివే..!