AK-47.. ఏకే 47 అనగానే ముందుగా టెర్రరెస్టులు.. మావోయిస్టులు గుర్తొస్తారు.. సాధారణంగా సామాజిక తిరుగుబాటుదారులు ఎక్కువగా ఈ ఏకే 47 తుపాకీలను ఎక్కువగా వినియోగిస్తుంటారు… అంతేకాదు.. దేశాల మధ్య యుద్ధాల సమయాల్లోనూ ఈ తుపాకీలను వాడుతుంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ గన్ పనిచేస్తుంటుంది.. అందుకే దీని పేరు అంతగా ప్రాచుర్యం పొందింది.
రెయిన్ ఫారెస్టుల్లో, ఎడారుల్లో, అతి శీతల మంచు కొండల ప్రాంతాల్లోనూ ఏకే 47 గన్ బాగా పనిచేస్తుంది. ప్రస్తుతం భారత్ వాడుతున్న ఇన్సాస్ రైఫిళ్లు మంచు ప్రాంతంలో పనిచేయడం లేదు.. ఏకే–47 రైఫిళ్లును రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం చేసుకుంది.
ఏకే–47 తుపాకులంటే ఏంటి? ఇంతకీ ఈ గన్లకు పేరు ఎలా వచ్చిందంటే? ఏకే అంటే ‘Avtomat Kalashnikova’ అని అర్థం.. 47 అంటే 1947 ఏడాదిగా చెబుతారు. సోవియట్ యూనియన్‌కు చెందిన మిహాయిల్ Kalashnikov ఈ గన్ కనిపెట్టారు. దాంతో ఆయన పేరు మీదనే AK-47 అని పేరొచ్చింది. అప్పట్లో సోవియెట్ సైన్యం కోసం ఈ తుపాకీలను అతి రహస్యంగా తయారు చేశారు. 1919, నవంబర్ 10వ తేదీన జన్మించిన Kalashnikova రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సోవియెట్ యుద్ధ ట్యాంక్ మెకానిక్‌గా పని చేశారు.
1941లో సోవియెట్‌పై జర్మనీ దురాక్రమణ సమయంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సోవియెట్ సైనికుల వద్ద పవర్‌ఫుల్ గన్స్ లేకపోవడం వల్లనే గాయపడాల్సి వచ్చిందని చెప్పారు. అలాంటి తుపాకుల కోసం చాలా శ్రమించారు. అనేక గన్ మోడళ్ల రూపొందించారు. చివరగా ఆయన AK-47 తుపాకీ మోడల్‌ను తయారు చేశారు. 1947లో మొట్టమొదటి సారిగా సోవియెట్ వీటి ఉత్పత్తిని ప్రారంభించింది. 1949లో ఈ తుపాకీలను అసాల్ట్ రైఫిల్‌గా సోవియట్ ఆర్మీ కొనుగోలు చేసింది.
వార్సా ఒప్పందం ద్వారా ఈ గన్స్ పలు దేశాలకు విస్తరించాయి.. వియత్నాం, అఫ్గానిస్థాన్, కొలంబియా, మొజాంబిక్ విప్లవాల్లో ఏకే–47 తుపాకులను వినియోగించారు. ఉపయోగించారు. అందుకే ఆ దేశ జెండాల్లో ఏకే–47 గన్ ఒక గుర్తుగా మిగిలిపోయింది. ఏకే–47 తుపాకుల ఉత్పత్తి దాదాపు దశాబ్దంపాటు కొనసాగింది. 1959లో AK-M పేరిట కొత్త వర్షన్ వచ్చింది. AK–47 తుపాకుల బరువును తగ్గించి, చౌక ధరకు ఈ కొత్త వర్షన్‌ను ఉత్పత్తి చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఏకే–47 తుపాకుల్లో 50 అమెరికా డాలర్లకు దొరికే వర్షన్లు లభ్యమవుతున్నాయి. AK-47 తుపాకుల్లో అనేక వెర్షన్లు తయారుచేసిన మిహాయిల్ కలష్నికోవ్‌ను స్టాలిన్ ప్రైజ్, ఆర్డర్ ఆఫ్ లెనిన్ అవార్డులు పొందారు. కలష్నికోవ్, 2013లో 94ఏళ్లకు మరణించారు.
ఆత్మరక్షణ కోసం సృష్టించిన AK–47 టెర్రరిస్టుల చేతుల్లో సామాన్యుల ప్రాణాలు తీస్తోందని తెలిసి కలష్నికోవ్ తన చివరి రోజుల్లో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్న ఈ ఏకే 47 గన్లకు తానే పూర్తి బాధ్యుడినని ఎంతో కుమిలిపోయారంట.. ప్రపంచవ్యాప్తంగా AK–47 తుపాకుల వల్ల కొన్ని కోట్ల మంది ప్రజలు మరణించారంట..