Mifepristone In US : అబార్షన్ మాత్రల వినియోగంపై అమెరికాలో రెండు కోర్టుల్లో భిన్నమైన తీర్పులు ..

గ‌ర్భ‌నిరోధ‌క మాత్ర‌ల‌పై వాషింగ్టన్,టెక్సాస్ లోని రెండు కోర్టు భిన్నమైన తీర్పులను వెలువరించాయి. దీంతో మిఫిప్రాస్టాన్(Mifepristone) గ‌ర్భ‌నిరోధ‌క మాత్ర‌ల వినియోగంపై గందరగోళం నెలకొంది.

Abortion Pills Mifepristone In US

Mifepristone In US : గ‌ర్భ‌నిరోధ‌క మాత్ర‌ల‌పై వాషింగ్టన్,టెక్సాస్ లోని రెండు కోర్టు భిన్నమైన తీర్పులను వెలువరించాయి. శుక్రవారం (2023,ఏప్రిల్) టెక్సాస్‌లో ట్రంప్ నియమించిన డిస్ట్రిక్ట్ జ‌డ్జి మ్యాథ్యూ కాక్స్ 20 ఏళ్లకు పైగా వినియోగంలో ఉన్న మిఫిప్రాస్టాన్(Mifepristone) గ‌ర్భ‌నిరోధ‌క మాత్ర‌ల‌(Abortion Pills)పై నిషేధాన్ని విధించారు. వీటి వినియోగాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. మరోవైపు ఒబామా నియమించిన వాషింగ్ట‌న్ కోర్టు జడ్జి థామస్ ఓ ఆ అబార్ష‌న్ పిల్ 17 రాష్ట్రాల్లో అందుబాటులో ఉండేలా చ‌ర్య‌ల‌ను తీసుకోవాల‌ని అధికారులను ఆదేశించారు. దీంతో గ‌ర్భ‌నిరోధ‌క మాత్ర‌ల‌ వినియోగంపై సందిగ్ధ‌త నెల‌కొంది.

అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో అబార్ష‌న్ చట్టరీత్యా నేరం. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం అనుమ‌తి ఉంది. అబార్ష‌న్ కోసం ఎక్కువ‌గా మిఫిప్రాస్టాన్(Mifepristone) మాత్ర‌ల‌ను వేసుకుంటారు. సంవత్సరకాలంలో అమెరికా కోర్టులో తీవ్ర స్థాయిలో వాద‌న‌లు కొనసాగుతున్న క్రమంలో రెండు కోర్టుల్లోను రెండు రకాల తీర్పులు ఇవ్వటంతో ప్రజలు గందరగోళంలో పడ్డారు. మిఫిప్రాస్టాన్(Mifepristone)మాత్రలు వాడాలా? వద్దా? అనేలా ఉంది పరిస్థితి.

సాధారణంగా గర్భస్రావం చేయించుకోవటానికి మిఫిప్రిస్టాన్ పిల్స్‌ సూచించబడుతుంది. ఈ మాత్ర 20 ఏళ్లుగా విస్తృతంగా అందుబాటులో ఉన్నందుకు ఈ పిల్ 10 వారాల గర్భస్రావం కోసం వినియోగిస్తున్నారు. యూఎస్ లో జరిగే అబార్షన్లలో సగానికి పైగా ఈ మాత్రల వల్లే జరుగుతున్నాయి. ఈ మాత్ర రెండు ఔషధాల కలయిక శస్త్రచికిత్స అవరసం లేకుండా గర్భస్రావం కావటానికి వినియోగించే పద్ధతి. యూఎస్ లో 53 శాతం మంది మిఫిప్రిస్టాన్ పిల్స్‌తోనే గ‌ర్భాన్ని తొలిగించుకుంటున్నారని తెలుస్తోంది. ఈ మాత్ర‌ల వినియోగం 2008లో 17 శాతం ఉండేది. అది 2017 నాటికి ఆ మాత్ర‌ల వాడ‌కం 39 శాతానికి పెరిగింది. అంటే ఏ స్థాయిలో ఈ పిల్ వల్ల గర్బస్రావాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

గర్బస్రావాలకు మాత్రల వినియోగంలో పద్ధతులుంటాయి. మ‌హిళ‌లు శృంగారం చేసిన త‌ర్వాత .. గ‌ర్భం దాల్చ‌కుండా ఉండేందుకు అబార్ష‌న్ మాత్ర‌లు వేసుకుంటారు. మిఫిప్రిస్టోన్‌ అనే మాత్రలు వేసుకుంటే ప్రొజెస్ట్రోన్ హార్మోన్ ఉత్ప‌త్తిని నిలిపివేస్తుంది. దీంతో ప్రెగ్నెన్సీ రాకుండా ఆగుతుంది. అంతే గర్బం దాల్చే అవకాశాన్ని ఈ మాత్రం అడ్డుకంటుంది. ఇక మిసోప్రోస్టాల్ అనే మరో మాత్రను కూడా కొంద‌రు వినియోగిస్తుంటారు. శృంగారం తరువాత 48 గంట‌లు దాటాకా ఈ మాత్ర‌ను వినియోగిస్తారు. అలా వేసుకోవటం వల్ల బ్లీడింగ్ అయి గ‌ర్భాశ‌య ప్ర‌దేశం ఖాళీ అవుతుంది. అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిష్ట్రేష‌న్‌.. మిఫిస్ట్రాన్‌, మిసోప్రోస్టోల్‌కు 2000 సంవ‌త్స‌రంలో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాయి. గ‌ర్భం క‌న్ఫార్మ్ అయిన 10 వారాల వ్య‌వ‌ధి వ‌ర‌కు ఈ మాత్ర‌ల‌ను వాడ‌వ‌చ్చు. ఒక‌వేళ ఆ స‌మ‌యం దాటితే..వాక్యూమ్ యాస్పిరేష‌న్ ప‌ద్ధ‌తిలో గ‌ర్భాన్ని తొల‌గిస్తారు.

అమెరికాలో దాదాపు 13 రాష్ట్రాల్లో అబార్ష‌న్ మాత్ర‌ల్ని బ్యాన్ చేశారు. రాజ్యాంగం ప్ర‌కారం అబార్ష‌న్ హ‌క్కు ఉన్నా.. గ‌త జూన్ నుంచి కొన్ని రాష్ట్రాలు మాత్రం ఆ మాత్ర‌ల్ని అమ్మ‌డం లేదు. ఇక చ‌ట్ట‌ప‌ర‌మైన అనుమ‌తి ఉన్న రాష్ట్రాల్లో మిఫిప్రిస్టోన్ మాత్ర‌ల్ని ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో కూడా అమ్ముతున్నారు. ఫార్మ‌సీల్లోనూ డాక్టర్ల సూచనమేరకు ప్రిస్క్రిప్ష‌న్ చూపిస్తే ఇస్తారు.

కానీ అబార్షన్లు చేయించుకోవటాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు.చట్టసభల్లో కూడా కొంతమంది సభ్యులు వీటిని వ్యతిరేకిస్తున్నారు. సురక్షితం కాని వాటిని నియంత్రించాలని లేదా పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. రక్తస్రావంతో పాటు ఇన్ఫెక్షన్లు రావటమే కాకుండా ఆరోగ్య ప్రమాదాలకు దారి తీస్తుందని ఇది లైసెన్స్ పొందిన ఆరోగ్య సంరక్షణ ద్వారా మాత్రమే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.