Middle East Conflict : ఈస్ట్ ఏషియా నెమ్మదిగా వార్ మోడ్ లో జారుకుంటోంది. ఇరాన్ ప్రతీకార దాడులకు దిగగా, కౌంటర్ ఇచ్చేందుకు ఇజ్రాయెల్ రెడీ అవుతోంది. రెండు దేశాల మధ్య యుద్ధమే జరిగితే.. ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలంగా మారే ఛాన్స్ ఉంటుంది. మరి ఆ ప్రభావం మన దేశంపై ఎంత? బంగారం మరింత మండబోతోందా? పెట్రోల్ రేట్లు ఆకాశానికి చేరుతాయా? సామాన్యుల జేబుకు చిల్లు పడటం ఖాయమా? భారీ ఖర్చులకు మనం సిద్ధం కావాల్సిందేనా?
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం భారత ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపించే ఛాన్సుంది? ఎగుమతులు, దిగుమతులు వ్యాపారాల లెక్క చూస్తే ఆ రెండు దేశాలతో ఇండియాకు ఉన్న సంబంధాలు ఏంటి? దౌత్యపరంగా మన దేశానికి సరికొత్త సవాళ్లు తప్పవా? భారత ప్రాజెక్టులకు ఎదురుదెబ్బ ఖాయమా? యుద్ధం మిగిల్చిన భయాలు చెబుతున్నదేంటి?
ఇరాన్ ఇజ్రాయెల్ వార్.. ఇండియాకు ఇబ్బంది తెచ్చే పరిణామం ఇది. పశ్చిమాసియా దేశాలకు బాస్మతి, బట్టలు, రత్నాలు, ఆభరణాలు, పత్తి భారత్ ఎగుమతి చేస్తుంది. ద్వైపాక్షిక వాణిజ్యంలో వజ్రాలు, పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు ఉన్నాయి. ఆసియాలో ఇజ్రాయెల్ కు భారత్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఈస్ట్ ఏషియాలో ఘర్షణలు పెరిగితే చమురు, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయం లాంటి రంగాల్లో వాణిజ్యానికి నష్టాలు తప్పకుండా ఉంటాయి. ఏప్రిల్, జూలై మధ్యలో ఇరాన్ కు భారత్ 538.57 మిలియన్ డాలర్ల ఎగుమతులు చేసింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఇది 1.22 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 4 నెలల్లోనే ఇరాన్ నుంచి 140.69 మిలియన్ డాలర్ల దిగుమతులు ఉన్నాయి.
ఇరాన్-ఇజ్రాయెల్ దేశాలు యుద్ధంలో తలపడితే.. భారత్ ఎటువైపు మొగ్గు చూపుతుంది అనే చర్చ ఉత్కంఠగా మారింది. భారత్ ఏ దేశంవైపు టర్న్ అయినా.. మరో దేశంతో దౌత్య సంబంధాలు దెబ్బతినడం ఖాయం. ఇలాంటప్పుడు భారత్ పరిస్థితి కత్తి మీద సామే. ఇజ్రాయెల్ 1948లో ఒక దేశంగా ఉనికిలోకి వచ్చింది. 1992 నుంచి ఆ దేశంతో భారత్ దౌత్య సంబంధాలు మొదలుపెట్టింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు రోజురోజుకు బలపడుతూ వచ్చాయి. ఇప్పుడు భారత్ కు ఆయుధాలు, టెక్నాలజీ ఎగుమతి చేస్తున్న అగ్రదేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఒకటి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్యలో దౌత్య సంబంధాలు బ్యాలెన్స్ చేయడం భారత్ కు సవాలే. ఇప్పటివరకు ఈ పనిని చాలా అద్భుతంగా చేసింది. భారత దౌత్యం గత పదేళ్లలో ఎక్కడా కూడా ఒకవైపు మాత్రమే ఉండేలా నిర్ణయాలు తీసుకోలేదు.
పూర్తి వివరాలు..
Also Read : ఇజ్రాయెల్-ఇరాన్ వార్.. మూడో ప్రపంచ యుద్ధం ఖాయమేనా? ఇక వినాశమేనా?