ఇజ్రాయెల్-ఇరాన్ వార్.. మూడో ప్రపంచ యుద్ధం ఖాయమేనా? ఇక వినాశమేనా?
ఈ చిచ్చు ప్రపంచమంతా అంటుకోబోతోందా? సమస్య మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయబోతోందా?

World War 3 : చేసిన పాపాలకు అనుభవిస్తావని ఇరాన్.. తప్పు చేశావ్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఇజ్రాయెల్.. రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణి దాడులకు దిగింది. కొడితే దిమ్మతిరగాలని కరెక్ట్ టైమ్ కోసం ఎదురుచూస్తోంది ఇజ్రాయెల్. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో మిడిలి ఈస్ట్ లో మంటలు రేగుతున్నాయి. ఈ చిచ్చు ప్రపంచమంతా అంటుకోబోతోందా? సమస్య మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయబోతోందా? ఓవైపు రష్యా-యుక్రెయిన్.. మరోవైపు ఇరాన్-ఇజ్రాయెల్.. ప్రపంచం యుద్ధంలోకి దిగిపోయినట్లేనా?
అసలు సంగతి తేల్చుకునేందుకు ఇరాన్-ఇజ్రాయెల్ రెడీ అయ్యాయి. ఆ దేశాలకు మద్దుతుగా నిలిచేది ఎవరు? ఎవరి వైపు ఎవరు ఉంటారు? అందరూ కలిసి ఏం చేస్తారు? ఓవైపు రష్యా-యుక్రెయిన్ టెన్షన్.. ఇప్పుడు కొత్తగా ఇరాన్-ఇజ్రాయెల్ భయం.. కంటి రెప్పపాటున వినాశనాన్ని సృష్టించే రోజులివి. మరి ఈ రెండు యుద్ధాలు.. మూడో ప్రపంచ యుద్ధానికి కారణం అవుతాయా? ఈ యుద్ధాల ప్రభావం ప్రపంచం మీద ఎలా ఉండబోతోంది?
ఇరాన్ తో కలిసి నడిచేదెవరు? ఇజ్రాయెల్ వైపు నిలిచేదెవరు? యుద్ధం ప్రభావం ప్రపంచంపై ఎంత? యుద్ధానికి పెద్దగా కారణాలు ఉండవు. చిన్నగా మొదలై సుడిగాలిలా మారి ప్రపంచాన్ని తుపానులా ముంచెత్తుతుంది. ఇరాన్-ఇజ్రాయెల్ విషయంలోనూ జరిగింది అదే. ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణలో ఇరాన్ ప్రవేశంతో సీన్ మారిపోయింది. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు మొదలయ్యాయి. హమాస్ కీలక నేత హనియేను తమ దేశంలో వేసేయడం, హిజ్బొల్లా చీఫ్ నస్రల్లాను లేపేయడం.. ఇరాన్ కు కోపం తెప్పించింది.
ఇజ్రాయెల్ మీద ప్రతీకారం తీర్చుకుంటోంది. క్షిపణి దాడులకు దిగింది. దీంతో మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ఇవి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ కు ముందు నుంచి మద్దతుగా ఉన్న అమెరికా ఇప్పుడు డైరెక్ట్ ఎంట్రీకి సిద్ధమవుతుండగా.. అదే జరిగితే ఇరాన్ కు రష్యా సైనిక సాయం అందించనుంది. రష్యా ఎంట్రీ ఇస్తే చైనా కూడా ఇరాన్ కు మద్దతుగా రంగప్రవేశం చేసే ఛాన్స్ ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. డ్రాగన్ కంట్రీ డైరెక్ట్ గా రాయకపోయినా మాట సాయమైనా చేసే చాన్స్ ఉంది.
Also Read : ఇరాన్ క్షిపణుల దాడి కారణంగా ఇజ్రాయెల్‌లో ఎక్కడ.. ఎంత నష్టం జరిగిందో తెలుసా..? ఐరన్ డోమ్‌కు ఏమైంది..