విపత్తులు.. ప్రకృతి బీభత్సాలు కేరళకు కొత్తేమి కాదు.. ఇలాంటి విపత్తులు, సంక్షోభాలను ఎన్నో ధీటుగా ఎదుర్కొన్న అనుభవం ఉంది. అదే ఇప్పుడు కేరళను కరోనా వైరస్ నుంచి బయటపడేసింది. విపత్తు సమయాల్లో ఎలా స్పందించాలో కేరళకు తెలిసినంతగా ఎవరికి తెలియదనే చెప్పాలి. గతంలో ప్రాణాంతక నిఫా వంటి వైరస్ లు వచ్చినా కేరళ ఒంటరిగా పోరాడింది. తమ ప్రజలను వైరస్ ల బారినుంచి రక్షించుకుంది. అదే అనుభవం ఇప్పుడు కరోనాపై పోరాడంలో విజయం సాధించింది.
ప్రపంచ దేశాలకు ఆదర్శంగా :
వాస్తవానికి భారతదేశంలో ముందుగా కరోనా వైరస్ తొలి కేసు నమోదైంది కూడా కేరళలోనే. ఇప్పుడు కరోనా కేసుల రికవరీలోనూ కేరళనే ముందుంది. జనసాంద్రత ఎక్కువే. చదరపు కిలోమీటర్ పరిధిలో 860 మంది వరకు నివసిస్తారు. విదేశీ రాకపోకలు కూడా కేరళలో ఎక్కువనే చెప్పాలి. గల్ఫ్‌లో పనిచేసేవారిలో కేరళ వారే ఎక్కువ. చైనాలోని వూహాన్‌లో చదువుకునే వైద్య విద్యార్థుల్లో ఎక్కువ మంది కేరళ వారే ఉన్నారు.
12 శాతం మందిలో 60 ఏళ్ల వయసు పైబడినవారే ఉన్నారు. ఫ్రంట్‌లైన్ ఉద్యోగులు ఉన్నారు. అయనప్పటికీ కరోనా కట్టడి చర్యల్లో కేరళలో ముందువరసలో నిలిచింది. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. విపత్తు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలో కేరళ నుంచి తప్పక నేర్చుకోవాల్సిందే. ఐక్యరాజ్య సమితి సైతం కేరళను ప్రశంసిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కేరళని చూసి పాఠాలు నేర్చుకోవాలని ప్రపంచ దేశాలకు సూచిస్తోంది.
1.4 బిలియన్ల నివాసితులలో చాలా మంది పెద్ద కుటుంబాలలో నివసిస్తున్నారు. నీటి సరఫరా లేదు. వస్తువులను శుభ్రపరచడం.. సామాజిక దూరాన్ని నిర్వహించడం కష్టతరం చేస్తుంది. అధునాతన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు ఉన్న దేశాలు సైతం మునిగిపోతున్నాయి. భారతదేశం ప్రతి 1,000 మందికి కేవలం 0.5 ఆసుపత్రి పడకలు
మాత్రమే కలిగి ఉంది.
ఇటలీ కంటే చాలా దూరమైన 1,000కి 3.2 పడకలు, చైనా 4.3తో ఉన్నాయి. అదనంగా, దేశవ్యాప్తంగా 30,000 నుండి 40,000 వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయి. పరీక్షా వస్తు సామగ్రి, ఆరోగ్య సంరక్షణ కార్మికులకు వ్యక్తిగత రక్షణ పరికరాలు, ఆక్సిజన్ ఫ్లో మాస్క్‌లు కూడా తక్కువ సరఫరాలో ఉన్నాయి.
మెడికల్ విద్యార్థికి కరోనా : కేరళలో తొలి కేసు ఇదే
కేరళలోకి కరోనా వైరస్ అడుగుపెట్టింది. జనవరి 18న వుహాన్ సిటీ నుంచి కేరళకు వచ్చిన ఓ మెడికల్ విద్యార్థికి కరోనా తొలి పాజిటివ్ కేసు నమోదైంది. అదే రోజు రాత్రి కేరళలోని పతనమిట్టి జిల్లా ఇంఛార్జీగా పేరొందిన పీబీ నుహ్ సివిల్ సర్వెంట్.. తన బృందంతో రంగంలోకి దిగారు. రాష్ట్రం, జిల్లా, గ్రామ స్థాయిలో సమన్వయంతో ముందుకు సాగారు. తొలి కరోనా కేసు నమోదైన వెంటనే కేరళకు వచ్చే అంతర్జాతీయ విమానశ్రయాల్లో స్ర్కీనింగ్ ఏర్పాటు చేసింది.
ఐదు ఎయిర్ పోర్టుల్లోనూ అంబులెన్స్, అత్యవసర కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లా ఆస్పత్రులను సైతం సన్నద్ధం చేసింది. ఈ బృందం.. గూగుల్ మ్యాప్ సాయంతో కరోనా పాజటివ్ వ్యక్తి ఎవరిని కలిసారో గుర్తించి వారిని క్వారంటైన్ చేస్తుండేవారు. వాట్సాప్ గ్రూపులతో ఎప్పటికప్పుడూ గ్రామాల వరకు సమాచారాన్ని అందించారు. పీబీ నుహ్.. 50 మంది పోలీసు అధికారులు, పారామెడిక్స్, వాలంటీర్లను తీసుకువచ్చి వారిని బృందాలుగా విభజించారు.
కీలకమైన వారంలో కుటుంబ కదలికలను తిరిగి తెలుసుకోనే వారు. బాధిత వ్యక్తి జిల్లా అధికారులకు స్క్రాప్‌లను ఇచ్చారు. చిరునామా, బాధితుల పేరు నూహ్ టాస్క్‌ఫోర్స్ గుర్తించే పనిలో పడ్డారు. కుటుంబం మొబైల్ ఫోన్‌ల నుండి తెచ్చిన GPS డేటాను, విమానాశ్రయం, వీధులు, దుకాణాల నుండి తీసిన సీసీ ఫుటేజీని ఉపయోగించి చర్యలను వేగవంతం చేశారు.
కరోనాకు రూ.20వేల కోట్లు విడుదల :
కేరళలో వ్యాధులు కూడా ఎక్కువనే చెప్పాలి. ఫ్లూ, డెంగ్యూ వంటి జ్వరాలు సర్వసాధారణమే. కొత్త వైరస్ ఏది వచ్చినా ప్రభుత్వం అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తోంది కేరళ. ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో నిధులు భారీగా కేటాయిస్తుంది. కరోనా వ్యాప్తి మొదలు కాగానే అధికార LDF ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రూ.20వేల కోట్ల రూపాయలు కేటాయించింది. పీపీఈ కిట్స్, మందులు పెద్ద మొత్తంలో తెప్పించింది. మాస్క్‌లు, శానిటైజర్లు భారీగా తయారు చేసింది. మానసిక ఆరోగ్యం కోసం ఒక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది.
కేంద్రం కంటే ముందే కేరళలో లాక్‌డౌన్ :
కేరళ సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రం కావడం, అందులోనూ అక్కడివారంతా విద్యావంతులు ఎక్కువ ఉండడంతో కరోనా ఎంత ప్రాణాంతకమో అర్థం చేసుకున్నారు. భౌతిక దూరం పాటించారు. రాష్ట్ర ప్రజలను మానసికంగా కేరళ సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం కంటే ముందే మార్చి 1న సీఎం పినరయి విజయన్ లాక్‌డౌన్ ప్రకటించారు. గత
రెండు వారాలుగా కేరళలో రోజుకి ఒకటీ రెండు కేసులు కంటే ఎక్కువ నమోదు కాకపోవడం ఆ రాష్ట్రం సాధించిన ఘన విజయంగా చెప్పుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలకు దేశాలకు కేరళ ఆదర్శంగా నిలిచిందని అంటున్నారు.
కరోనా సమయంలో ముందుగానే కరోనా పాజిటివ్ కేసులను గుర్తించి వారిని ఇతరుల నుంచి వేరు చేసింది. కరోనా లక్షణాలు కనిపించేంతవరకు వేచి చూడకుండా సాధ్యమైనంతవరకు అందరికి వైద్య పరీక్షలు చేయించింది. పాజిటివ్ అని తేలితే వెంటనే ఆస్పత్రులకు తరలించింది. కొంతమందిని క్వారంటైన్ కు తరలించింది. ఇంటింటికి నిత్యా వసరాలను పంపిణీ చేసింది.
కమ్యూనిటీ కిచెన్ లు ఏర్పాటు చేసింది. వలస కూలీలకు ఆహారాన్ని అందించింది. ఉపాధి పనులు కోల్పోయినవారికి బియ్యం సహా ఇతర నిత్యావసర సరుకులను కూడా ఇంటింటికి పంపిణీ చేసింది. కేరళ ప్రభుత్వం మార్గదర్శకాలకు తగినట్టుగా అక్కడి ప్రజలు కూడా క్రమశిక్షణతో ఇంటిపట్టునే ఉంటూ ప్రభుత్వానికి, పోలీసులకు సహకరించారు.
14 రోజులు కాదు.. 28 రోజుల క్వారంటైన్ :
కరోనా వైరస్ ఇంట్లో ఒకరికి సోకితే వారితో పాటు కుటుంబ సభ్యులు, వారు ఎవరెవరిని కలిశాడో గుర్తించి వారందరిని క్వారంటైన్ చేస్తూ వచ్చింది. కరోనా అనుమానుతులను కేవలం 14 రోజులు మాత్రమే క్వారంటైన్ పరిమతం చేయలేదు.. ముందు జాగ్రత్త చర్యగా 28 రోజుల వరకు క్వారంటైన్ చేసింది. కొంతమందిలో కరోనా లక్షణాలు 14 రోజుల్లో బయటపడటం లేదు.
దీని కారణంగా కూడా వారి నుంచి ఇతరులకు కరోనా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. అందుకే కరోనా కట్టడిలో కేరళ పకడ్బందీ చర్యలను చేపట్టడంతోనే కరోనా వ్యాప్తిని విజయవతంగా నియంత్రించడం సాధ్యమైందని అంటున్నారు. కేరళ తరహాలోనే ఇతర రాష్ట్రాలు, ప్రపంచ దేశాలు అనుసరిస్తే.. తప్పకుండా కరోనాను నియంత్రించడం సాధ్యమే అవుతుంది.