White Paper Revolution: చైనాలో ‘తెల్ల కాగిత’ విప్లవం.. ప్రభుత్వంపై పెల్లుబికుతున్న ప్రజాగ్రహం ..

చైనాలో జీరో కోవిడ్ విధానానికి వ్యతిరేఖంగా చేపట్టిన నిరసనల్లో తెల్ల కాగిత ఉద్యమం తీవ్రరూపం దాల్చుతోంది. ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో ఏ4 తెల్లకాగితాల విక్రయాన్ని ఆపేశారనే వందతులు కూడా వ్యాపిస్తున్నారు.

White Paper Revolution: చైనాలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ప్రభుత్వం విధించిన జీరో కొవిడ్ విధానానికి వ్యతిరేకంగా, మాకు స్వేచ్ఛను కల్పించాలని డిమాండ్ చేస్తూ షాంఘై, రాజధాని బీజింగ్ సహా నగరాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ నిరసనలు తెలుపుతున్నారు. సాధారణంగా చైనా ఆందోళనలు తొలిదశలోనే అణచివేస్తారు. ప్రభుత్వాన్ని, వ్యక్తులను కించపరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. అయితే, జీరో కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా చైనీయులు గత కొన్ని సంవత్సరాలుగా చూడని విధంగా రోడ్లపైకి వచ్చి తెల్ల కాగితాలతో శాంతియుతంగా తమ నిరసనను వ్యక్తంచేస్తున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చైనాలో జరుగుతున్న తెల్ల కాగితాల విప్లవం చర్చనీయాంశంగా మారింది.

 

White Paper protest

చైనాలో తెల్లకాగితాల విప్లవం ఇప్పటిది కాదు. 2020లో హాంకాంగ్ ఆందోళనల్లో కూడా తెల్లకాగితాన్ని గుర్తుగా వినియోగించారు. తెల్ల కాగితాలతో విప్లవం అంటే శాంతియుతంగా, ఎవరిపైనా వ్యతిరేఖ నినాదాలు చేయకుండా తెల్ల పేపర్, ఏ4 పేపర్ చూపుతూ నిరసన తెలపడం. సాధారణంగా చైనాలో ఎటువంటి ఆందోళననైనా ఆదిలోనే తుంచేస్తారు. ఈ క్రమంలో ఎలాంటి విమర్శలకు తావులేకుండా మౌనంగా తెల్ల కాగితాన్ని చూపుతూ ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు. ఈ ఉద్యమం చైనాలో ఉధృతంగా కొనసాగుతోంది. సోషల్ మీడియాలోనూ విస్తృత ప్రచారం పొందుతుంది. అయితే, చైనా ప్రభుత్వం మాత్రం తెల్ల కాగితాలతో నిరసన తెలిపే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలు వైరల్ కాకుండా జాగ్రత్త పడుతోంది. ఆ దేశంలోని టెక్ దిగ్గజాలైన టిక్ టాక్, విబో వంటివి తెల్ల కాగితాలను తమ వేదికలపై నుంచితొలగిస్తున్నాయి.

చైనాలో జీరో కోవిడ్ విధానానికి వ్యతిరేఖంగా చేపట్టిన నిరసనల్లో తెల్ల కాగిత ఉద్యమం తీవ్రరూపం దాల్చుతోంది. ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో ఏ4 తెల్లకాగితాల విక్రయాన్ని ఆపేశారనే వందతులు కూడా వ్యాపిస్తున్నారు. ఫలితంగా ఏ4 సీట్స్ తయారు చేసే ప్రముఖ సంస్థ ఎం అండ్ జీ తమ ఉత్పత్తిని నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రముఖ స్టేషనరీ చైన్ స్టోర్ల సంస్థ ఎం అండ్ జీ స్టేషనరీ షేర్లు 3.1శాతం పతనమయ్యాయి. అయితే ఈ వార్తలను సంస్థ ఖండించింది.

ట్రెండింగ్ వార్తలు