Nicole smith : బుర్జ్ ఖలీఫాపై నిలబడిన ధీర వనిత ఎవరు?

828 మీటర్ల ఎత్తు బుర్జ్ ఖలీఫా భవనంపై కేవలం మీటరు స్థలం ఉన్న ఒక చిన్న పలకపై నిల్చుని యాడ్ లో కనిపించిన నికోల్ స్మిత్ లడ్విక్ హాట్ టాపిక్ గా మారింది. ఎమిరేట్స్‌ మిమానయాన సంస్థ నిర్వహించిన ఈ యాడ్ తో నికోల్ ధైర్యం చూసినవారి గుండెలు దడదడలాడిపోతున్నాయ్..

Emirates Ads In Nicole smith : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా రికార్డు నెలకొల్పింది బూర్జ్‌ ఖలీఫా చిత్రీకరించిన యాడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎమిరేట్స్‌ మిమానయాన సంస్థ బూర్జ్‌ ఖలీఫా టాప్ లో ఓ యాడ్ ని చిత్రీకరించి సోషల్ మీడియాలో వదటంలో అదికాస్తా వైరల్ గా మారింది. ఇదంతా బాగానే ఉంది. మరి అంత ఎతైన భవనంపై ఈ యాడ్‌లో కనిపించిన యువతి ఎవరు?ఆమెకు ఎంత ధైర్యం? ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేననే లా ఉంది యాడ్ లో ఆమె ధీరత్వం చూస్తే. ఇప్పుడు ఆమె గురించే హాట్ టాపిక్. ఈ ధీర వనిత ఎవరు? ఏమా ధైర్యం? అంటూ అంతా ఆమె గురించే ఆరా తీస్తున్నారు.

ఎమిరేట్స్ యాడ్స్ లో కనిపించిన ఆ యువతి యూకేకు చెందిన నికోల్ స్మిత్ లడ్విక్. నికోల్ వృత్తిరీత్యా స్కైడైవింగ్ ఇన్ స్ట్రక్టర్. ఆమెకు సాహసాలు ప్రయాణాలు అంటే ఇష్టం. సాహసాలు చేయటమంటే ప్రాణం. ఆమె వరల్డ్ ట్రావెలర్, స్కైడైవర్. అంతేకాదు యోగా ఇన్ స్ట్రక్టర్. హైకర్,అడ్వెంచరర్. అని నికోల్ తన ఇన్ స్టా గ్రామ్ లో రాసుకున్నారు. ఆమె సాహసాల ఫోటోలు ఆమెఇన్ స్టాలో పోస్ట్ చేస్తుంటారు. ఆమె సాహస నారి కాబట్టే ఈ యాడ్ కు ఆమెను సెలక్ట్ చేసుకుని ఉంటుంది ఎమిరేట్స్ విమానయాన సంస్థ.

ఈ క్రమంలో ఎమిరేట్ యాడ్స్ లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా రికార్డు నెలకొల్పింది బూర్జ్‌ ఖలీఫా యాడ్ లో కనిపించిన ఆమె పేరు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

యాడ్ లో ఆమెను చూస్తే గుండె దడదడే..
యాడ్ లో ఆమెను చూసినవారికి గుండె దడదడలాడిపోతుంది. చూసినవారికే ఇలా ఉంటే ఇక ఆమె ధైర్యం గురించి చెప్పుకుని తీరాల్సిందే. ఈ యాడ్ లో నికోల్ ఎమిరేట్స్‌ విమానాల్లో దుబాయ్‌ రావాలంటూ ప్లకార్డులు పట్టుకుని ఆహ్వానం పలుకుతుంది.

చివరల్లో ఒక్కసారిగా కెమెరా జూమ్‌ అవుట్‌ అవగానే భూమి నుంచి 828 మీటర్ల ఎత్తులో కేవలం మీటరు స్థలం ఉన్న ఒక చిన్న పలకపై ఆ ఎయిర్‌ హోస్టెస్‌ నిల్చుని ఉన్న దృశ్యం కనిపిస్తుంది. ఆకాశంలో నిలబడి ఆకాశయానికి ఆహ్వానం పలుకుతున్నట్టుగా యాడ్‌ ఆకట్టుకుంటుంది. ప్లకార్డులు మార్చి చూపించే సమయంలో కూడా నికోల్ ఏమాత్రం తడబడకపోవటం గమనించాల్సిన విషయం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా రికార్డు నెలకొల్పిన బూర్జ్‌ ఖలీఫాపై ఈ యాడ్‌ను చిత్రీకరించారు.

వైరల్ గా మారిన ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేయండీ ఈ ధీరనారి సాహసంపై..

ట్రెండింగ్ వార్తలు