Sri Lanka New President Anura Kumara Dissanayake (Photo Credit : Google)
Sri Lanka New President Anura Kumara Dissanayake : శ్రీలంకలో నవ శకానికి నాంది పలికారు ప్రజలు. తొలిసారిగా మార్క్సిస్ట్ భావజాలం ఉన్న నాయకుడు అనుర కుమార దిసనాయకేని.. తమ కష్టాలు, కన్నీళ్లను తుడుస్తాడని అధ్యక్ష పదవిపై కూర్చోబెట్టారు. మరి ఆర్థిక, రాజకీయ సంక్షోభం నుంచి దిసనాయకే సింహళ ప్రజలకు దిశ చూపుతారు. దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? భారత్ సహా మిగతా పొరుగు దేశాలతో ఎలా కలిసి వెళ్తారు? ఇదే ఇప్పుడు అంతటా ఆసక్తికర పొలిటికల్ చర్చకు తావిస్తున్న అంశం..
Also Read : అణ్వాయుధాలతో దాడి అంటూ.. హెచ్చరించిన రష్యా అధ్యక్షుడు పుతిన్
భారత్, చైనాల మధ్య శ్రీలంక సాండ్ విచ్ లా నలిగిపోదలుచుకోలేదు. ఇది ఆ దేశ నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత దిసనాయకే చేసిన కామెంట్స్. జేవీపీ(జనతా విముక్తి పెరమునె) ముందు నుంచి భారత వ్యతిరేక వైఖరితోనే ఉంది. మరి దిసనాయకే దేశాధ్యక్షుడిగా ఇండియాతో ఎలా వ్యవహరిస్తారు? వామపక్ష ధోరణితో చైనాకు కొమ్ము కాస్తారా? లేక భారత్ తో సన్నిహితంగా ఉంటూ ముందుకు వెళ్తారా? ఇదే ఇప్పుడు అందరిలోనూ మెదలుతున్న ప్రశ్న.
అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే.. పొరుగు దేశాలతో సంబంధాలపై లంక కొత్త అధ్యక్షుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా మధ్య తాము సాండ్ విచ్ లా నలిగిపోదల్చుకోలదని వ్యాఖ్యానించారు. అసలు ఏ రెండు దేశాల మధ్య తాము ఒత్తిడికి గురి కావాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. భౌగోళిక, రాజకీయ శత్రుత్వాల మధ్య చిక్కుకునే పరిస్థితులకు కొలంబో వీలైనంత దూరంగా ఉంటుందని దిసనాయకే తేల్చి చెప్పారు. తాము ఓ వర్గం పక్షం వహించమని క్లారిటీ ఇచ్చారు. భారత్, చైనాతో సంబంధాలను నేషనల్ పీపుల్స్ పవర్ ప్రభుత్వం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలని నిర్ణయించిందని వెల్లడించారు.
ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ.. శ్రీలంక సార్వభౌమత్యాన్ని కాపాడుకోవడానికి తటస్థ వైఖరిని అవలంభిస్తుందని దిసనాయకే సంకేతాలు ఇవ్వడం శుభపరిణామం. ప్రపంచ శక్తుల ఆధిపత్య పోరుకు దూరంగా ఉంటూ ఉభయతారకంగా ప్రయోజనాలు ఉండేలా రాజకీయాలు, దౌత్యం నెరుపుతామని చెప్పడం దిస్సనాయకే ఫ్యూచర్ ప్లానింగ్స్ కు సూచిస్తుంది. అయితే, జేవీపీకి ఇండియాపై గతంలో అనుకూల దృక్పథం లేదు. ముఖ్యంగా 1980లలో శ్రీలంక వ్యవహారాల్లో భారత్ ప్రమేయాన్ని ఆ పార్టీ తీవ్రంగా విమర్శించింది. శ్రీలంక అంతర్ యుద్ధం సమయంలో తమళ వేర్పాటువాద ఉద్యమాలకు మద్దతివ్వడంలో భారత్ పాత్ర వారికి నచ్చలేదు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ప్రచారం చివరి దశలో సెప్టెంబర్ 16న జరిగిన రాజకీయ చర్చా కార్యక్రమంలో భారత్ పై దిసనాయకే కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే శ్రీలంకలో అదానీ గ్రూప్ పెట్టుబడులు ఉన్న విండ్ పవర్ ప్రాజెక్ట్ ను రద్దు చేస్తానన్నారు. ఈ పరిణామాలన్నీ దిసనాయకేపై భారత్ కు వ్యతిరేకి అనే ముద్రను వేశాయి.
పూర్తి వివరాలు..