కరోనా వైరస్ మరింత తీవ్రతరం కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అప్రమత్తం అయ్యింది. రాబోయే రోజుల్లో వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉందని WHO అత్యవసర కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న డాక్టర్ మైక్ ర్యాన్ ప్రకటించారు. ప్రస్తుతానికి కరోనా పూర్తిగా పతాకస్థాయికి చేరుకోలేదని మరియు “ఇంకా తీవ్రంగా ఉంది” అని ఆయన అన్నారు.
వైరస్ వ్యాప్తి చెందుతున్న తీరు ఆధారంగా కొన్ని అంచనాలు రూపొందించారు. ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా వైరస్ తీవ్రత ఇలాగే కొనసాగితే వచ్చే వారంలోనే కోటి మంది కరోనా బాధితులు ప్రపంచంలో తయారవ్వచ్చు అని ఆయన చెప్పారు.
వైరస్ అంచనాల విషయంలో చాలా అనిశ్చితి ఉందని, దీనిని అంచనా వేయడానికి ప్రతిచయనాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నట్టు తెలిపిన ఆయన.. ప్రస్తుత పరిస్థితిని బట్టి మరో 5 శాతం కంటే ఎక్కు తీవ్రత ఉంటుందని వివరించారు.
ప్రస్తుతం ప్రపంచంలో 95లక్షల మందికి కరోనా సోకగా.. 4లక్ల 85వేల మంది చనిపోయారు. అయితే 52లక్షల మంది కోలుకున్నారు. అయితే వచ్చే వారంలో ప్రపంచంలో దాదాపు 5లక్షల మంది పెరిగి కోటి మంది కరోనా బారిన పడొచ్చు అని అంచనా.
Read: 10మంది భారత జవాన్లను చైనా ఆర్మీ 3రోజుల పాటు తన కస్టడీలో ఎలా ఉంచింది, గాల్వన్ ఇన్ సైడ్ స్టోరీ