Donald Trump : అమెరికా అధ్యక్ష పీఠాన్ని తాను ఎట్టి పరిస్థితిలోనూ వదిలి పెట్టేది లేదని డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఖరాఖండిగా చెప్పారు. అధ్యక్ష పీఠం కోసం అవసరమైతే.. ఎంతవరకైనా పోరాడతానని మరోసారి బల్లగుద్ధి చెప్పారు.. జార్జియాలో జరగనున్న రన్నాఫ్ ఎన్నిక నేపథ్యంలో తన మద్దతు దారులు నిర్వహించిన భారీ ర్యాలీలో ట్రంప్ పాల్గొని మాట్లాడారు. ఎవరూ వైట్ హౌస్‌లోకి అడుగు పెట్టలేరని, తాను అధ్యక్ష పీఠాన్ని వదిలి పెట్టేది లేదన్న ట్రంప్ వ్యాక్యలు మరోసారి అమెరికాలో కలకలం రేపాయి.
ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని లేకపోతే.. తానే భారీ మెజారిటీతో గెలిచేవాడినని మరోసారి చెప్పారు ట్రంప్.. అదే సమయంలో తన ఎన్నికల ఫలితంపై రిపబ్లికన్ చట్టసభల సభ్యులు మౌనం పాటించాలని సూచించారు. చట్టసభల సంయుక్త సమావేశంలో బైడెన్ ఫలితాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని రిపబ్లికన్ సభ్యులకు పిలుపునిచ్చారు. అలాగే అధ్యక్ష భవనం వద్ద భారీ ర్యాలీ నిర్వహించాలని తన మద్దతుదారులకు సూచించారు.
చట్టసభలో మనకు అంతా అనుకూలంగానే జరుగుతుందని ట్రంప్ తన మద్దతుదారులకు తెలపడం కొత్త కలకలాన్ని రేపుతోంది.. అయితే రిపబ్లికన్లలో ట్రంప్‌కు మద్దతు పలుకుతుండగా మరికొందరు ప్రస్తుత, మాజీ సభ్యులు మాత్రం.. ఇది అమెరికా ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించినట్టే అంటున్నారు.